బీసీ జన జాగరణ జాతరకు ఎంపీ వద్దిరాజుకు ఆహ్వానం
MP Vaddiraju Invited to BC Jana Jagaran Jathara
హైదరాబాద్: బీసీల చైతన్యమే లక్ష్యంగా, తమ హక్కుల సాధనే ధ్యేయంగా “మన ఆలోచన సాధన సమితి (ఏంఏఏస్ఏస్ఏస్)” ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీన ఆదివారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో “బీసీ జన జాగరణ జాతర” నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నర్సింగ్ రావు, ఆహ్వాన కమిటీ సభ్యులు కోల భాస్కర్ రావులు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ మరియు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
రాజకీయాలకు అతీతంగా అన్ని సబ్బండ కులాలను సంఘటితం చేస్తూ, బీసీలకు న్యాయమైన హక్కుల సాధన లక్ష్యంగా ఈ జాతరను నిర్వహిస్తున్నామని నర్సింగ్ రావు, భాస్కర్ రావులు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది హాజరవుతారని వారు పేర్కొన్నారు.



