Wednesday, April 8, 2026

సహస్ర చండీకా మహాయజ్ఞానికి ఎంపీ వద్దిరాజుకు ఆహ్వానం

- Advertisement -

సహస్ర చండీకా మహాయజ్ఞానికి ఎంపీ వద్దిరాజుకు ఆహ్వానం

MP Vaddiraju Invited to Sahasra Chandika Mahayagna

హైదరాబాద్: కర్నాటక రాజధాని బెంగళూరులోని అనెకల్ శ్రీశంకరాచార్య ఆశ్రమం పరిధిలో ఉన్న శ్రీసాయి రుక్మిణీ మహల్ ప్రాంగణంలో ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు సహస్ర చండీకా మహాయజ్ఞం ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ మహాయజ్ఞానికి హాజరు కావలసిందిగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను నిర్వాహకులు సాదరంగా ఆహ్వానించారు. బెంగళూరుకు చెందిన న్యూ బెల్డవిన్ విద్యాసంస్థలు మరియు శ్రీ సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ మహాయజ్ఞం జరగనుంది.

న్యూబెల్డవిన్ విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ కే. వేణుగోపాల్, కొణిదెల చంద్రకాంత్ లు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర క్యాంప్ కార్యాలయంలో కలిసి మహాయజ్ఞం ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజుతో పాటు ఆయన సన్నిహితులు మరికల్ పోత సుధీర్ కుమార్‌ను కూడా వేణుగోపాల్ ప్రత్యేకంగా ఆహ్వానించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్