సుప్రియకు ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే కందాళ నివాళి
MP Vaddiraju, MLC Tata Madhu, and former MLA Kandala pay tribute to Supriya.

ఖమ్మం (వాయిస్ టుడే): అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన సుప్రియ చిత్రపటానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఖమ్మం సింహాద్రి నగర్ ఫేజ్-1లోని సుప్రియ తండ్రి దారం శ్రీనివాస్ నివాసానికి వెళ్లిన వారు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
సుప్రియ ఐదేళ్లుగా భర్త రంజిత్, కుమారుడితో కలిసి అమెరికాలో నివసిస్తూ సెయింట్ లూయిస్‌లో రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. రెస్టారెంట్ మూసివేసి మిస్సోరిలోని ఇంటికి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ట్రక్కు వారి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుప్రియ అక్కడికక్కడే మృతి చెందగా, కోదాడకు చెందిన ఆమె మిత్రురాలు గాయపడ్డారు.
విషాద వార్త తెలుసుకున్న వెంటనే రవిచంద్ర, తాతా మధుసూదన్, కందాళ ఉపేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు శీలంశెట్టి వీరభద్రం, బెల్లం వేణు తదితరులు శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. సుప్రియ చిత్రపటానికి పూలుజల్లి నివాళులర్పించి, దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి మనోధైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.




