Friday, February 20, 2026

ముక్కోటి ఏకాదశి సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమలలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దర్శనం

- Advertisement -

ముక్కోటి ఏకాదశి సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమలలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దర్శనం

MP Vaddiraju Ravichandra visits Tirumala with family on the occasion of Mukkoti Ekadashi

తిరుమల, డిసెంబర్ 30 (2025):
ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

మంగళవారం తెల్లవారుజామున కలియుగ ఇష్టదైవం శ్రీవెంకటేశ్వర స్వామిని అత్యంత విశిష్టమైన ముక్కోటి ఏకాదశి (పుత్రదా ఏకాదశి) రోజున ఉత్తర ద్వారం (వైకుంఠ ద్వారం) ద్వారా దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ఈ దర్శనంలో వద్దిరాజు కిషన్–శశిరేఖ, వద్దిరాజు దేవేందర్–ఇందిర, వద్దిరాజు రవిచంద్ర–విజయలక్ష్మీ, వద్దిరాజు వెంకటేశ్వర్లు–ఉమామహేశ్వరి, శీలం సత్యనారాయణ–లక్ష్మీ, డాక్టర్ జె.ఎన్.వెంకట్–సునీత, వద్దిరాజు శ్రీనివాస్–శిల్ప, బోరిగం విజయ్–మాధవి, డాక్టర్ గంగుల గంగాభవాని, రౌతు కనకయ్య–సుధారాణి, ఈ.వెంకటేశ్వర్లు–వసంతలక్ష్మీ, బోరిగం సోమయ్య–స్వరూపారాణి, మరికల్ పోత సుధీర్ కుమార్, ఊసా రఘు, కూసం శ్రీనివాసులు, ఎస్.విజయ్ కుమార్, ఆర్.విక్రమ్ కుమార్, కే.గణేష్, గొల్లముడి కిరణ్, వద్దిరాజు ప్రీతమ్, నందన్, సుశ్రుత్, సాన్విత్, గంగుల సనవ్, గంగుల సౌరవ్, బోరిగం హృదిత్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వేద పండితులు ఎంపీ వద్దిరాజు రవిచంద్రను శాలువాలతో సత్కరించి ఆశీర్వచనాలు అందించారు. అలాగే ఎంపీ రవిచంద్రతో పాటు ఆయన అన్న దేవేందర్ తమ తలనీలాలను స్వామి వారికి సమర్పించారు.
అదేవిధంగా, ఎంపీ రవిచంద్ర సతీమణి వద్దిరాజు విజయలక్ష్మీ తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం పాడిపంటలు, శాంతి సౌభాగ్యాలతో చిరకాలం సుభిక్షంగా వర్థిల్లాలని శ్రీవెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామి వారిని వేడుకున్నట్లు చెప్పారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్