పెట్రోలియం, సహజ వాయువు శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడిగా ఎంపీ వద్దిరాజు మరోసారి నియమాకం
MP Vaddiraju reappointed as member of Parliamentary Standing Committee on Petroleum and Natural Gas
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ స్థాయీ సంఘం సభ్యులుగా తిరిగి నియమితులయ్యారు.ఎంపీ రవిచంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యులుగా నియమితులవ్వడం ఇది వరుసగా మూడవ సారి.
ఈ మేరకు లోకసభ డిప్యూటీ సెక్రటరీ సుజయ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సంఘంలో మొత్తం 31 మంది సభ్యులు కాగా,లోకసభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది ఎంపీలు ఉంటారు.
ఈ స్టాండింగ్ కమిటీకి ఛైర్మన్ గా లోకసభ ఎంపీ సునీల్ దత్తాత్రేయ తట్కరే మరోసారి నియమితులయ్యారు.



