Monday, February 23, 2026

ఎంపీ వద్దిరాజు అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి పయనం

- Advertisement -

ఎంపీ వద్దిరాజు అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి పయనం
వాయిస్ టుడే :

MP Vaddiraju returns home from America

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అమెరికా పర్యటనను దిగ్విజయంగా ముగించుకుని స్వదేశానికి తిరిగి పయనమయ్యారు.ఎంపీ రవిచంద్ర అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ సమీపాన లీస్ బర్గ్ వద్ద జరిగిన గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ ఆధ్వర్యాన జరిగిన మహాసభ (కన్వెన్షన్)కు ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే.
గత నెల 31 వతేదీన అమెరికా పర్యటనకు వెళ్లిన ఆయన శనివారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం)వాషింగ్టన్ డీసీలోని DULLES INTERNATIONAL AIRPORT (IAD) నుంచి తిరిగి పుట్టిన గడ్డకు బయలుదేరారు.విమానాశ్రయంలో ఎంపీ రవిచంద్రకు గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ కన్వీనర్ సంగని రజనీకాంత్ పుష్పగుచ్ఛమిచ్చి శాలువాతో సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికారు.అసోసియేషన్ గ్లోబల్ కన్వెన్షన్ కు ముఖ్య అతిథిగా హాజరవ్వడంతో పాటు, పలువురు ప్రవాస భారతీయ తెలుగు ప్రముఖులతో సమావేశమై వారికి ఎదురవుతున్న సమస్యల గురించి ఎంపీ రవిచంద్ర అడిగి తెలుసుకున్నారు.విద్య, ఇమ్మిగ్రేషన్ , భద్రత, కుటుంబ సంక్షేమం, వైద్యారోగ్య,ఆర్థిక భద్రత, అవసరమైన న్యాయ సహాయం గురించి వారితో ఆయన కూలంకషంగా చర్చించారు.అమెరికాలో తెలుగు వారికి ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ రవిచంద్ర హామీనిచ్చారు.
తన పర్యటనలో భాగంగా ఆయన అమెరికాలోని వివిధ పరిపాలన విభాగాలు పని చేస్తున్న తీరుతెన్నులు, అత్యుత్తమ విధానాల గురించి అధ్యయనం చేశారు.
వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా తదితర ప్రాంతాలను సందర్శించి అక్కడ ప్రభుత్వ విధానాల అమలును ఎంపీ రవిచంద్ర నిశితంగా పరిశీలించారు.స్వదేశానికి తిరిగి పయనమైన ఎంపీ వద్దిరాజుకు వాషింగ్టన్ విమానాశ్రయంలో సంగని రజనీకాంత్ తదితర ప్రముఖులు ఘనంగా వీడ్కోలు పలికారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్