చిన్నయ్య స్వామి చెంచుల ఆధార్ విషయంపై స్పందించిన ఎంపీడీవో భాగ్యలక్ష్మి.
MPDO Bhagyalakshmi responded to the Aadhaar issue of Chinnayya Swamy Chenchu.
రుద్రవరం
రుద్రవరం మండలం కోటకొండ గ్రామపంచాయతీ చిన్నయ్య స్వామి చెంచుగూడెం లో 40 మందికి ఆధార్ కార్డు లేక ప్రభుత్వ పథకాలలో భాగంగా పౌల్ట్రీ ఫాం ద్వారా మేలు రకం జాతి కోళ్లను అందజేయాలని చెంచుగూడెంలో పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ మనోరంజన్ ప్రతాప్ సర్వే చేయగా ఆధార్ లేకఇబ్బందులు పడుతున్నారన్న వార్త గత5 రోజుల క్రితంపత్రికలలో వచ్చిన వార్తకు స్పందించిన రుద్రవరం ఎంపీడీవో భాగ్యలక్ష్మి మంగళవారం ఆమెఆధ్వర్యంలో చెంచుగూడెంలో ప్రత్యేక ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోటకొండ గ్రామ పంచాయతీ చిన్నయ్య స్వామి చెంచుగూడెంలో ఆధార్ కార్డు లేని వారికి, ఫోన్ నెంబర్ ఆధార్ కు లింకు కాని వారికి పిలిపించి ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు. ఈ క్యాంపును గ్రామంలోని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో తెలిపారు. ఈ ప్రత్యేక ఆధార్ కార్డు ఏర్పాటు చేసినందుకు చెంచు నాగమ్మ ఎంపీడీవోకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రుద్రవరం పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ మనోరంజన్ ప్రతాప్, ఏ హెచ్ ఏ బాలు నాయక్,డిజిటల్ అసిస్టెంట్ మహేంద్ర నాయక్, మహిళా పోలీస్ త్రివేణి, ఏఎన్ఎం నాగేశ్వరమ్మ, అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి, గ్రామస్తులు పాల్గొన్నారు.


