ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ చేరికతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం: చిలుక  మధుసూదన్ రెడ్డి

- Advertisement -

ఎల్బీనగర్, వాయిస్ టుడే::  బీఆర్ఎస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, బీ.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్నల చేరికతో కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గంలో మరింత బలోపేతం అవుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ను చిలుక మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన నివాసానికి చేరుకొని పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, దేశంలో అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular