- Advertisement -
మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో నేటి నుండి11వరకు ముక్కోటి ఏకాదశి బ్రహ్మోత్సవాలు
Mukkoti Ekadashi Brahmotsavams from Today to 11 at Maddileti Narasimhaswamy Temple
బేతంచెర్ల :
మండల పరిధిలోని ఆర్ ఎస్ రంగాపురం గ్రామ శివారులోవెలిసిన శ్రీ మద్దిలేటి లక్ష్మి నరింహస్వామి ఆలయంలోని ముక్కోటి ఏకాదశి బ్రహ్మోత్సవాలలో స్వామివారి ఉత్తర ద్వారా దర్శనానికి క్యూ లైన్ల ఏర్పాట్లను ఆలయ ఈఓ ఎం.రామాంజనేయులు,ఎస్ఐ రమేష్ బాబు,లు మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్డీఓ నరసింహులు,ఆధ్వర్యంలోజరిగే రేపటి నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలలో భక్తులకు త్రాగునీటి,వైద్య,సదుపాయాలు అన్నదానం దగ్గర ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.ఉత్సవాలలోభక్తులు సిబ్బందికి సహకరించాలని కోరారు.
- Advertisement -