పట్టణ ప్రజలు సీజన్ వ్యాధుల బారిన పడకుండా మున్సిపల్ అధికారులు చూడాలి
Municipal authorities should ensure that they are not affected by seasonal diseases
సిపిఎం
శ్రీశైలం
ఆత్మకూరు పట్టణ ప్రజలు సీజన్ వ్యాధులు అంటురోగాల బారిన పడకుండా మున్సిపల్ అధికారులు, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి ఏ. రణధీర్, సీనియర్ నాయకులు ఎం. రజాక్ లు కోరారు. గురువారం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందర ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జరిగిన సభకు సిపిఎం పార్టీ పట్టణ నాయకులు డి. రామ్ నాయక్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని 24 వార్డ్ లలో పారిశుద్ధ్య లోపం వల్ల ప్రజలు అంటు రోగాల బారిన అతిసారా వ్యాధితో, డయేరియాతో బాధపడుతున్నారు.
ఆత్మకూరు పట్టణంలో లో అనేక వార్డులలో మంచినీటి కుళాయిలలో ఇప్పటికీ బురద నీరు మురికి నీరు రావడం జరుగుతుంది కాలువలలో పూడికలు తీయగా వర్షాల వల్ల కాలువలు నిండి రోడ్లపైకి మురికి నీరు రావడం జరుగుతుందిఅలాగే బోరింగులు రిపేరి చేయడానికని విప్పదీసి రెండు సంవత్సరాలనుండి ఇంత వరకు రిపీరి చేయలేదు, అలాగే పట్టణంలో అనేక వీధులలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ సగం వరకు వేచారు మిగతా పనులు అట్లే పెండింగ్లో ఉన్నాయి. అలాగే చిన్నపాటి వర్షానికి పట్టణంలోని పలు వీధులలోని రోడ్లు చేపల చెరువులను తలపిస్తున్నాయని అన్నారు.
అదేవిధంగా పట్టణములోని 24 వార్డులలో దోమలు, ఈగల బెడద వల్ల అక్కడి ప్రజలు డెంగ్యూ, మలేరియా విష జ్వరాలతోపాటు చర్మ వ్యాధుల వలన ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ఏ వీధికి వెళ్ళిన కుక్కల బెడద ఎక్కువగా ఉందన్నారు.
కనుక మున్సిపల్ అధికారులు పట్టణ ప్రజలు సీజన్ వ్యాధుల బారిన పడకుండా కాలువలలో పూడికలు తీసి మంచినీటి కులాయి పైపులు లీకేజీలు ఉన్నచోట మరమ్మతులు చేసి అన్ని వార్డులలో దోమల నివారణకు పాగింగ్ చేసి అంటూ రోగాల బారిన పడకుండా చూడాలని సిపిఎంపార్టీ పట్టణ కమిటీ మున్సిపల్ అధికారులను,
కోరుచున్నాము. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ హరి ప్రసాద్,మున్సిపల్ కో ఆప్షన్ నెంబర్ ఎంఎ రషీడ్ మాట్లాడుతూ తన పరిధిలోని సమస్యలను వెంటనే పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే సిపిఎం పార్టీ పట్ట కమిటీ బృందంతో కమిషనర్ పట్టణంలోని చెత్త కుప్పల దగ్గరకి పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ నాయకులు ఎన్. స్వాములు, నాయకులు పాతకోట భాస్కర్, కలిముల్లా, చాంద్, రైట్ బాషా, జబివుల్ల, రాముడు, రమణ, పుల్లయ్య, ఏ. కిరణ్, నబి, సామెలు, అంబయ్య, చందు తదితరులు పాల్గొన్నారు.