Wednesday, February 11, 2026

మొదలైన మున్సిపల్ ఎన్నికలు…సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి

- Advertisement -

మొదలైన మున్సిపల్ ఎన్నికలు

నిర్మల్ జిల్లా ప్రతినిధి (వాయిస్ టుడే) ఫిబ్రవరి 11

Municipal elections are underway…special focus on problematic polling stations
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి

ఖానాపూర్ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పటిష్ట పోలీసు బందోబస్తును పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్

జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఖానాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన 6వ వార్డు , జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్ స్వయంగా సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన పటిష్ట పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న పోలింగ్ అధికారులతో, సిబ్బందితో మాట్లాడి అక్కడున్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ మాట్లాడుతూ ఎన్నికల వేళ భద్రతా వ్యవస్థను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని,ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి, నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని చెప్పారు.

ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్న పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

శాంతియుత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు నిర్మల్ పోలీసులు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ స్పష్టం చేశారు.

ఈ పర్యవేక్షణలో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ తో పాటు , అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి (అడ్మిన్), ఇన్స్పెక్టర్ అజయ్, ఎస్ఐ రాహుల్ ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్