*మున్నూరు కాపులు ఐక్యంగా ముందుకు సాగాలి*
*బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి
మాజీ రాష్ట్ర హౌస్ ఫేడ్ చైర్మన్
*Munnur Kapus should move forward unitedly: Bomma Sriram Chakravarthy
తెలంగాణలో మున్నూరు కాపులు ఐక్యంగా ముందుకు సాగి గ్రామ స్థాయి నుండి మున్నూరు కాపులను సంఘటితం చేసి ఏకతాటిపై నడిపించేందుకు కృషి చేయాలని మాజీ రాష్ట్ర హౌజ్ ఫెడ్ చైర్మన్ ,జిల్లా మున్నూరు కాపు సంఘం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి అన్నారు. శుక్రవారం కరీంనగర్ లోని కాపువాడలో మున్నూరు కాపు సంఘo సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ రాష్ట్ర హౌజ్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మాట్లాడుతూ మున్నూరు కాపులు అన్ని రంగాలలో ముందుండాలని మున్నూరు కాపులు రాజకీయాలకతీతంగా ముందుకు సాగి అభివృద్ధి దిశలో పయనించాలన్నారు. తెలంగాణలో మున్నూరు కాపు లు ఐక్యంగా ముందుకు సాగి రాజకీయాలకతీతంగా సదస్సులు సమావేశాలు నిర్వహించి మున్నూరు కాపులను చైతన్య పరచాలని అన్నారు. మారుమూల గ్రామంలో కూడా మున్నూరు కాపు సంఘాలను ఏర్పాటు చేసి మున్నూరు కాపు కులాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుక వెళ్లే దిశగా ముందుకు సాగ లన్నారు. మున్నూరు కాపుల అందరిని సంఘటిత పరిచే ఒక తాటిపైకి తీసుకువెళ్లేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని మున్నూరు కాపు లందరు సభ్యత్వ నమోదును వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా మున్నూరు కాపు సభ్యత్వ నమోదులో ప్రథమ స్థానం ఉంటుందని తెలిపారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘ సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బొల్లం లింగమూర్తి, సంయుక్త కార్యదర్శి వాసాల హరీష్, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి సత్తినేని శ్రీనివాస్ నాయకులు తోట శివ, కోమటి రెడ్డి మనోజ్ కుమార్, వాసాల నరేష్,చిందం వెంకటేష్ కుల బాంధవులు పాల్గొన్నారు.


