- Ji

వాయిస్ టుడే : హైదరాబాద్
మున్నూరు కాపు పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో కొండాపూర్ లో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పటేల్ యూత్ ఫోర్స్ అన్ని విభాగాలలోనూ కన్వీనర్ లను నియమించారు. వంగపల్లి నరేష్ ఎంటర్టైర్మెంట్ వింగ్ కన్వీనర్, సాయి ఆచార్య డాక్టర్ వింగ్ కన్వీనర్,ఆట్టేపల్లి ప్రశాంత్ పటేల్ యువ పారిశ్రామిక విభాగం కన్వీనర్,
తోట ప్రమోద్ పటేల్ కన్వీనర్గా నియమించారు. అదే విధంగా
ముఖ్య అతిథిగా కొత్త లక్ష్మణ్ పటేల్ మరియు గ్రేటర్ హైదరాబాద్ సెక్రటేరియట్ పేరుక రమేష్ పటేల్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ హైదరాబాద్ లో బాల బాలికల హాస్టల్ వసతుల నిర్మాణం కోసం పెద్దల సహకారం తో కలిసి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. నా వంతు కృషి చేస్తానని తెలిపారు. మరియు మున్నూరు కాపు సామాజిక వర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పటేల్ యూత్ ఫోర్స్ ముందు ఉండాలని కోరారు. మరియూ రాష్ట్ర కన్వీనర్ లు మాట్లాడుతూ జిల్లాల వారీగా వాట్స్ ఆప్ గ్రూప్లు ఏర్పాటు చేయడం జరిగిందని,యూత్ ఫోర్స్ ప్రధాన కర్తవ్యం హైదరబాద్ లో బాల బాలికల హాస్టల్ వసతి కోసం ప్రయత్నం ఆ దిశగా పటేల్ యూత్ ఫోర్స్ ముందుకు సాగుతుందని తెలిపారు.
త్వరలో జరగబోయే కార్తీక వన భోజనలకు యూత్ బారి ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే భవిష్యత్తులో అన్ని జిల్లాలో సమావేశలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పటేల్ యూత్ ఫోర్స్ రాష్ట్ర కన్వీనర్ లు అఖిల్ పటేల్, అభిషేక్ పటేల్, రామక్రిష్ణ, ప్రశాంత్ పటేల్, తోట సాయి చరణ్, క్రాంతి, హరికృష్ణ ఐటి వింగ్ మధు,స్పోర్ట్స్ వింగ్ నిఖిల్ పటేల్, సోషల్ మీడియా కన్వీనర్ రాజేందర్
మరియు వివిధ విభాగాల కన్వీనర్ లు పాల్గొన్నారు.



