గతంలో ఇచ్చిన హామీలు ఏమైంది
తెలంగాణ ప్రభుత్వం బీసీల అందరికీ లక్ష రూపాయల చొప్పున బీసీ బందు పథకం ద్వారా అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుంది .కానీ బిసి కులాలలో చాలా వాటికి కులవృత్తులు లేవని వారికి ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. బీసీలలో గననీయంగా ఉన్నటువంటి మున్నూరు కాపులను ఈ పథకం కింద విస్మరించడం అనేటువంటిది టిఆర్ఎస్ ప్రభుత్వం మన మున్నూరు కాపుల పట్ల ఈ రకమైనటువంటి వైఖరితో ఉన్నదని తేటతెల్లమవుతుంది .
గతంలో కూడా గద్వాల సంబంధించిన మున్నూరు కాపులకు 50 లక్షల రూపాయలు కట్టుకోవడానికి హాస్టల్ నిర్మాణానికి ఇస్తున్నామని గత ఎలక్షన్ ముందర హడావుడి చేసినటువంటి ఈ బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఏమాత్రం డబ్బులు ఇవ్వకుండా మొండి చెయ్యి చూపింది.మున్నూరు కాపులను దగా చేసింది.
రేపు గద్వాల పర్యటనకు వస్తున్నటువంటి కేటీఆర్ కు మున్నూరు కాపుల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం మున్నూరు కాపులను కూడా బీసీ బంధు ఇవ్వాలి. మున్నూరు కాపుల కుల వృత్తి వ్యవసాయం వ్యవసాయం.వ్యవసాయం చేయడం నేరమా?? రాష్టాన్ని వ్యవసాయంలో అగ్రమగామిగా చేసినటువంటి, కర్షకులైనటువంటి మున్నూరు కాపులకు బీసీ బంధు ఇవ్వకుండా ఎలా మోసం చేస్తుందో అనేటువంటిది మున్నూరు కాపులు గ్రహించారు. ఈ ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను రాబోయే ఎలక్షన్లలో కచ్చితంగా చూపిస్తారు. బీసీ బందు మున్నూరుకాపులకు వర్తించేవరకు కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మున్నూరు కాపుల కోపానికి గురికావద్దని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే బీసీ బందులో మున్నూరు కాపులను చేర్చి అధిక సంఖ్యలో బీసీ బంధువు ఇవ్వాలని కోరుచున్నాము . మున్నూరు కాపు జిల్లా ఉపాధ్యక్షుడు కొత్త గణేష్ రామపురం రఘు మహానంద్ రెడ్డి రవి కాపలకుంట వెంకటేష్ బాలు వెంకటేష్ మోహన్ భాస్కర్ నారాయణ కిరణ్ పుటంపల్లి రాజు అల్లపడు వెంకటేష్ మున్నూరు కాపు కార్పొరేషన్ కు డిమాండ్ చేస్తున్నాము రేపు యొక్క KTR కాన్వాయ్ ని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాము



