తెలంగాణ మున్నూరుకాపు జర్నలిస్టు ఫోరం ద్వితీయ ప్లీనరీ పోస్టర్ ఆవిష్కరించిన అడిషనల్ డీసీపీ లు లక్ష్మీనారాయణ, వెంకటరమణ

కరీంనగర్ ఆగష్టు 31(వాయిస్ టుడే ) తెలంగాణ మున్నూరుకాపు జర్నలిస్టు ఫోరం ద్వితీయ ప్లీనరీ పోస్టర్ ను అడిషనల్ డీసీపీ కరీంనగర్ ఎ. లక్ష్మీనారాయణ, మల్కాజ్గిరి డీసీపీ వెంకటరమణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమన్నారు. రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ క్లీనర్ కి సంబంధించిన ఇన్విటేషన్ కార్డు అందించి వారిని ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది కరీంనగర్ జిల్లా కేంద్రంలో మొదటి ప్లీనరీ సమావేశాన్ని సుమారు 12 వందల మంది మున్నూరుకాపు జర్నలిస్టులతో కలిసి నిర్వహించామన్నారు. ద్వితీయ ప్లీనరీలో జర్నలిస్టుల ఆకాంక్షలు, భవిష్యత్ కార్యాచరణ రూపొందించి వాటి సాదన దిశగా అడుగులు వేస్తామన్నారు. 33 జిల్లాలకు చెందిన మున్నూరుకాపు జర్నలిస్టులు అధిక సంఖ్యలో హాజరై ప్లీనరీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ పటేల్, ప్రధాన కార్యదర్శి సూదుల వెంకటరమన్ పటేల్ మాట్లాడుతూ సెప్టెంబర్ 6న సికింద్రాబాద్ క్లాక్ టవర్ మహబూబ్ కాలేజ్ వద్దగల ఎస్ వీ ఐటీ కన్వెన్షన్ లో ఉదయం 10గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టిఎంకేజేఎఫ్ రాష్ట్ర ముఖ్య సలహాదారులు యోగేశ్వర్ రావు,కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు దులూరి జగన్ మోహన్ పటేల్, కొత్త సత్యనారాయణ పటేల్, సుమ పటేల్, బండి రఘు పటేల్, కోశాధికారి తోటరమణ పటేల్, కార్యవర్గ సభ్యులు రాచమల్ల సుగుణాకర్ పటేల్ పాల్గొన్నారు.



