బండి సంజయ్ కి సంపూర్ణ మద్దతు ప్రకటించిన మున్నూరుకాపు సంఘం తెలంగాణ
బీసీ బిడ్డను రెండు లక్షల మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి – చింతపండు మహేందర్
బండి సంజయ్ కి బీసీ సంఘాలు సంపూర్ణ మద్దతుగా నిలువాలి – బండి సంజీవ్
కరీంనగర్ టౌన్, మే 10 (వాయిస్ టుడే): మున్నూరుకాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరుకాపు యువత ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంట్ బిజెపి పార్టీ అభ్యర్థిగా కమలం పూర్తి పైన పోటీ చేస్తా ఉన్న బండి సంజయ్ కే మా సంపూర్ణ మద్దతును తెలియజేస్తాము అని మున్నూరు కాపు యువత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజీవ్ అన్నారు. ఈరోజు మున్నూరుకాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరుకాపు యువత ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర కన్వీనర్ చింతపండు మహేందర్ అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మున్నూరుకాపు యువత రాష్ట్ర అధ్యక్షులు బండి సంజీవ్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీసీ బిడ్డ, మున్నూరుకాపు ముద్దుబిడ్డ బండి సంజయ్ కు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాం అన్నారు. బీసీ బిడ్డ మున్నూరుకాపు ముద్దుబిడ్డ బండి సంజయ్ ను కరీంనగర్ పార్లమెంట్ నుంచి రెండోసారి 2 లక్షల మెజారిటీతో ఢిల్లీకి పంపించి కేంద్రమంత్రి పదవి వరించేలా భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునివ్వడం జరురిగింది.మున్నూరుకాపు బిడ్డకి కేంద్రం మంత్రి కావాలన్నా బీసీ రాజ్యాధికారం రావాలన్నా అది బండి సంజయ్ గెలుపుతోనే సాధ్యమని తెలియజేస్తున్నాం అన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మున్నురుకాపులు సామాజికంగా ఆర్థికంగా, రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజకీయంగా మనం వెడకబడుతుండటమే దీనికి ప్రధాన కారణం కాబట్టి మున్నూరు కాపులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని అది కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్న మున్నూరుకాపు కుల బాంధవులతోనే సాధ్యమని తెలియజేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంగురాల రాజేష్, సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇమ్మడిశెట్టి మోహన్, రాష్ట్ర నాయకులు చీరంజి తిరుపతి యువత జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీను కుల బాంధవులు పాల్గొన్నారు