మర్డర్, ఆత్యాచారం జరగలేదు
ప్రత్యూష కేసులో సుప్రీం కోర్టు
Murder, rape not committed
Supreme Court in Pratyusha case
న్యూఢిల్లీప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీలో కీలక అంశాలు వెల్లడించింది. 60 పేజీల సుప్రీంకోర్టు తీర్పు కాపీలో 12 కీలక అంశాలను వెల్లడించింది.
ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి కి పురుగులు ముందు ప్రాణాంతకం అని తెలిసినా కొనుగోలు చేశాడు. ఇద్దరు సేవించి నటి ప్రత్యుష ను పురిగొల్పాడు , సిద్ధార్థ్ రెడ్డి దోషిత్వం పూర్తిగా రుజవైందని సుప్రీం కోర్ట్ పేర్కోంది. . ప్రత్యూషను గొంతు నిలిమి హత్య చేశారని వాదనకు ఆధారాలు లేవని తేల్చింది. కోర్టుకు సబ్మిట్ చేసిన మెడికల్ రిపోర్టులు సాక్షులు వాంగ్మూలాలు ప్రకారం ఆమె విషం తీసుకుని చనిపోయినట్లు గుర్తించింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డి నటి ప్రత్యూష పై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు రుజువు కాలేదు. కేసు విచారణ చాలాకాలం జరిగిన తర్వాత ప్రత్యూష పై మర్డర్ , అత్యాచారం జరిగిందనే ఆరోపణలు పరిగణలోకి తీసుకోవడం కష్ట సాధ్యం అని అభిప్రాయపడింది.
. ఈ కేసులో అత్యంత కీలకమైన పోస్ట్ మార్టం రిపోర్ట్ పై అభ్యంతరం చెప్పిన సుప్రీంకోర్టు, డాక్టర్ మునిస్వామి సమర్పించిన రిపోర్టు అన్ ప్రొఫెషనల్ గా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది.
ఈ కేసులో నివేదికను సమర్పించక ముందే, అసంపూర్తి సమాచారాన్ని బయట పెట్టడం వల్ల కేసు దారిమల్లింది దాని పర్యావసనాలు తీవ్రంగా ఉన్నాయని అభిప్రాయపడింది.
. ఈ కేసులో కీలక సాక్షి నంబర్ 34 వాంగ్మూలం విశ్వసనీయంగా ఉందని, అది తీర్పులో కీలకపాత్ర పోషించిందని ధర్మాసనం పేర్కోంది. పరిస్థితుల ప్రభావం సాక్ష్యాలు స్పష్టంగా నిందితుడికి వ్యతిరేకంగా ఉన్నాయి. . కుల్ డ్రింక్ లో ఏదో కలిపామని, అది ప్రమాదవశాత్తు జరిగిందన్న డిఫెన్స్ వాదనను న్యాయస్థానం తిరస్కరించింది. ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయో గించిన ‘నొవాక్రాన్’అనే పురుగుల మందును సిద్ధార్డ్ రెడ్డీ కొనుగోలు చేశాడన్న విషయం రుజువైంది. ఇది ఆత్మహత్యకు ప్రేరేపించడమే. చెల్లూరు కేసులో ఇచ్చిన తీర్పును ఈ కేసులో అన్వయించుకోలేమని స్పష్టం చేసింది. ఇది అత్యంత కీలకమైన అంశం.. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో ఆత్మ హత్య చేసుకోవాలని నిర్ణయిందుకున్నప్పుడు.అందులో ఒకరు చనిపోయి, మరొకదు బతికితే చట్ట ప్రకారం బతికున్న వ్యక్తి ఆ మరణానికి బాధ్యుడవుతాడు. ఈ చట్టపరమైన అంశం ఆధారంగానే సిద్ధార్డ్ రెడ్డిని దోషిగా కోర్టు నిర్ధారించింది.



