Saturday, December 21, 2024

మంచం కింద జిలెటిన్‌ స్టిక్స్ పెట్టి..మర్డర్

- Advertisement -

మంచం కింద జిలెటిన్‌ స్టిక్స్ పెట్టి..మర్డర్

Murdered by Keeping gelatine sticks under the bed

కడప, సెప్టెంబర్ 30, (వాయిస్ టుడే)
మంచం కింద జిలెటిన్ స్టిక్స్‌ పెట్టి సినిమా లెవెల్‌లో వీఆర్‌ఏను హత్య చేసిన ఘటన కడప జిల్లాలో సంచలనంగా మారింది. ఈ ఘటనలో వీఆర్‌ఏ స్పాట్‌లో మరణించగా.. అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడికి బాబు అనే వ్యక్తితో విభేదాలు ఉన్నాయి. వివాహహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. వైఎస్ఆర్ కడప వేముల మండలం కొత్తపల్లికి చెందిన వీఆర్‌ఏ నరసింహ తన ఇంట్లో నిద్రిస్తున్నారు.. అయితే ఆయన మంచం కింద జిలెటిన్ స్టిక్స్‌ పెట్టి పేల్చడంతో ఆయన అక్కడే చనిపోయాడు. ఈ ఘటనలో వీఆర్‌ఏ నరసింహ భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనకు వివాహేతర సంబంధం విషయంలో పాతకక్షలే కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.. బాబు అనే వ్యక్తి ఈ పేలుడుకు కారణమని అనుమానిస్తున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కాగా.. ఈ ఘటనలో వీఆర్ఏ ఇల్లు ధ్వంసమైంది.. అయితే బాబు అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తోంది మృతుడి కూతురు పుష్పావతి.తన తల్లీ.. బాబుతో మాట్లాడలేదన్న కోపంతోనే తన నాన్నను చంపాడని చెబుతోంది. నరసింహ ఇంటికి సమీపంలో ఉన్న రమేష్ ఇంటి వద్ద నుంచి బ్యాటరీ గన్ ద్వారా జిలెటిన్ స్టిక్ అమర్చిన డిటోనేటర్‌ను మంచం కింద పడేలా షూట్ చేశారు. ఈ దుర్ఘటనలో నరసింహ ఆయన భార్యకు తీవ్ర గాయలు అయ్యాయి. చికిత్సకు తరలిస్తుంటే నరసింహ మార్గ మధ్యలోనే చనిపోయాడు. హత్య చేయడానికి ఉపయోగించిన జిలెటిన్ స్టిక్స్ ఎక్కడ లభించాయని ఎవరి వద్ద కొనుగోలు చేశారన్న విషయంపై కూడా దర్యాప్తు సాగుతోంది. బైరటీస్ గనుల్లో పని చేస్తున్న బాబు అక్కడి నుంచే వాటిని తీసుకొని వచ్చే అవకాశం ఉందంటన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశంగా పోలీసులు భావిస్తున్నారు. ఇలా విచ్చలవడిగా ఎవరికి వాళ్లు తీసుకనేందుకు ఎలా వీలుపడుతుందా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. పేలుడు పదార్థాలు ఎక్కడ లభించాయో తెలుసుకు కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారుబాబు కుటుంబానికి.. తమ కుటుంబానికి మధ్య గతంలో గొడవలు జరిగాయని.. రాత్రి తన తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో కరెంటు తీసి.. జిలెటిన్ స్టిక్స్‌ పెట్టి.. బాబు చంపాడని కూతురు పుష్పావతి ఆరోపించింది.గత రెండు నెలల క్రితం కూడా బాబు వీఆర్‌ఏ నరసింహతో గొడవ పడ్డాడని.. అప్పటినుంచి కక్ష పెంచుకుని.. చంపాడని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. కాగా.. ఈ ఘటన ఏపీలో సంచలనంగా మారింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్