- Advertisement -
నాకు దక్కిన గౌరవం అభిమానులదే
చిరంజీవి
హైదరాబాద్
పద్మవిభూషణ్ పురస్కారానికి తనను ఎంపిక చేయ డం పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడా లో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితిలో తాను ఉండిపోయానని చిరంజీవి తెలిపారు. దేశంలో రెండో అత్యున్నత పౌరపురస్కారం లభించి నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబం అండదం డలు.. నీడలా తనతో నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే తాను ఈరోజు ఈ స్థితిలో ఉన్నా నన్న మెగాస్టార్.. తనకు దక్కిన గౌరవం మీదన్నారు. మీరు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.
- Advertisement -