Wednesday, May 20, 2026

నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే నా బాధ్యత

- Advertisement -

నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే నా బాధ్యత

My responsibility is to serve the people of the constituency

నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు

నరసరావుపేట,
నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నరసరావుపేట శ్యాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ బాబు దావోస్ పర్యటన విజయవంతం అయింది అన్నారు.  వరల్డ్ ఎకనామిక్ ఫారం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది నాడు ప్రజలకు మొదటిసారి ఐటీనీ పరిచయం చేసి తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు అన్ని రాష్ట్రల ప్రతినిధులు తమ రాష్ట్ర శ్రేయస్సు కొరకు పోటీపడ్డారు కానీ చంద్రబాబు మాత్రం రాష్ట్రం కోసమే కాకుండా యావత్ దేశం తరపున దావోస్ లో నాయకత్వం వహించారు అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా ఎముకలను కొరికే చలిని సైతం లెక్కచేయకుండా రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం దావోస్ నడివీధుల్లో సీఎం చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పడిన శ్రమ సత్ఫలితాలనిస్తున్నాయి అన్నారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ టాటా చైర్మన్ చంద్రశేఖరన్ వంటి ప్రపంచ దిగ్గజాలు సీఎం చంద్రబాబు  విజన్ ను మెచ్చుకోవటం రాష్ట్రంలో పెట్టుబడి పెడతానని హామీ ఇవ్వడం చంద్రబాబు విజన్ 2047 విజయాన్ని సూచిస్తుందన్నారు. టిసిఎస్ బీపీసీఎల్ రిలయన్స్ గ్రీన్ కో అర్సలర్ మిట్టల్ నిప్సన్ స్టీల్ పీపుల్ టేక్ వంటి ఎన్నో పరిశ్రమలు ఇప్పటికే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతున్నాయి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటికీ 2 సంవత్సరాలు పూర్తయింది నారా లోకేష్ ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని రాష్ట్రంలోని యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేశారు అని అన్నారు. ఒక్క జూమ్ కాల్ తోనే అర్సలర్ మిట్టల్ మరియు నిప్స్టన్ స్టీల్ కంపెనీలతో మాట్లాడి రాష్ట్రానికి 1.46 లక్షల కోట్ల పెట్టుబడును తీసుకువచ్చిన ఘనత నారా లోకేష్ కి దక్కింది అన్నారు. 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు నియోజవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల కొరకే పలుమార్లు మంత్రులను కలుస్తున్నానని డంపింగ్ యార్డ్ ఇట్కో ఆటోనగర్ లేఔట్లలో గృహ నిర్మాణ సమస్యలను సకాలంలో పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కొత్తపాలెం గ్రామం నుండి కోటప్పకొండ వరకు రోడ్ల నిర్మాణం కొరకు సుమారుగా 4 కోట్ల నిధులను తీసుకురావడం జరిగిందని మరికొన్ని నిధులు తీసుకురావడం కొరకు కృషి చేస్తున్నానన్నారు. సోషల్ మీడియాలో అనేక రకాలుగా మాటలాడి పెడతారు వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్