బాల్కొండ నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ఈ జాబ్ మేళా ఏర్పాటు
రాజకీయాలకు అతీతంగా జాబ్ మేళా నిర్వహణ
ఇది నిరంతరాయంగా కొనసాగుతుంది
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
జాబ్ మేళా కార్యక్రమానికి యువత నుండి విశేష స్పందన
ఆయా కంపెనీలకు ఎంపికైన అభ్యర్థులకు మంత్రి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్ లు

నిజామాబాద్: బాల్కొండ నియోజకవర్గ నిరుద్యోగ యువతీ, యువకుల కోసం వేల్పూరు మండలం లక్కొరా ఏఎన్జి ఫంక్షన్ హాల్లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ నిరుద్యోగ జాబ్ మేళాకు నియోజకవర్గ యువత నుండి విశేష స్పందన లభించింది. ఉద్యోగం కోసం తమ చిన్నారులతో వచ్చి మహిళలు జాబ్ మేళా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పలువురు మహిళలు పలు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 70 పైగా కంపెనీలు ఈ జాబ్ మేళాలో ఇంటర్వ్యూలు నిర్వహించగా పలువురికి అక్కడికక్కడే ఆయా కంపెనీలకు ఎంపికైన అభ్యర్థులకు మంత్రి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్ లు అందజేశారు. ఈ సందర్బంగా ఆశావహులను ఉద్దేశించి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగించారు.

“ప్రజల ఆశీర్వాదం తో రెండు సార్లు గెలిచిన. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదం తో మంత్రిగా అయ్యాను. ఏళ్లలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేశాను. ఇపుడు యువతకు ఉద్యోగాలు కల్పించే లక్షం తో ఇలాంటి జాబ్ మేలా లు చేపట్టినాము. ఇది రాజకీయ ప్రయోజనం కోసం చేసిన పని కాదు. రాజకీయాలకు అతీతంగా జాబ్ మేళా ఉంటది. ఇలాంటి జాబ్ మేళా లు నిరంతరం గా కొనసాగుతాయి. జాబ్ మేళా ను యువత పెద్ద ఎత్తున తరలివచ్చి సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పటికే న్యాక్ ద్వారా 12 వేల మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించాం. ఎంత దూరం అయిన ఒక్క అడుగు తో మొదలు అవుతాది. జీవితం లో ఎంత ఉన్నత స్థాయికి ఎదిగిన వారైనా ప్రారంభం లో చిన్న స్థాయి నుండి వచ్చినవారే ఉంటారు. నేను 1990 లో 800 జీతానికి చేరి 1994 లో 16వేల జీతానికి చేరుకున్నాను. హైదరాబాద్ లో అప్పట్లో అదే హయ్యెస్ట్ సాలరీ. మనం గమ్యం చేరాలంటే ప్రయత్నం చేయాల్సిందే. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 1లక్ష 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేదు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. యువ మంత్రి కేటీఆర్ కృషి వల్ల తెలంగాణ లో 9 లక్షల కొత్త ఐటి ఉద్యోగాలు సృష్టిచబడ్డాయి. యువత వారు తల్లి దండ్రులు గర్వపడేలా ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆసరా ఫౌండేషన్ వారి సౌజన్యంతో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించాం. భవిష్యత్ లో కూడా నిరుద్యోగ యువత కోసం మళ్లీ జాబ్ మేళా నిర్వహిస్తాం. ఇది ఇట్లే కొనసాగుతుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నా శుభాకాంక్షలు.” అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డా.మధు శేఖర్,రైతు నాయకుడు కోటపాటి నర్సింహ నాయుడు,పలువురు అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



