10 లక్షల రూపాయల చెక్కును అందజేసిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ
చాగలమర్రి
My sisters will accompany me
మండలంలోని చిన్న వంగలి గ్రామంలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన కుటుంబాన్ని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పరామర్శించడం జరిగింది. ప్రొద్దుటూరులో చదువుకుంటున్న అదే కుటుంబంలోని రెండవ కుమార్తె ప్రసన్నను అక్కున చేర్చుకొని నీకు నేను తోడుగా అక్కల ఉన్నానంటూ ధైర్యం ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ కుటుంబానికి అండగా ఉంటామని 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని, అలాగే ఆ అమ్మాయి బాగోగులు చూసుకునే వాళ్ళ నాయనమ్మకు కూడా రెండు లక్షల రూపాయలను ఇవ్వడం జరిగింది. ఐటీ మంత్రి నారా లోకేష్ గారితో మాట్లాడి పాప చదువు గురించి మాట్లాడడం జరిగింది. ఎన్టీఆర్ స్కూల్లో నే కచ్చితంగా ఆ పాప ఎంత వరకు చదివితే అంతవరకు తాము చదివిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అమ్మాయి చదువు బాధ్యతే కాకుండా ఆ అమ్మాయికి పెళ్లి అయ్యే వరకు నేనే తోడుగా ఉంటానని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇవ్వడం జరిగింది.