మెట్రో రైలులో అనాథలతో మైనంపల్లి జన్మదిన వేడుకలు
Mynampally birthday celebrations with orphans in metro train
హైదరాబాద్
మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా… ఆయన అనుచరులు, అభిమానులు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అరుణార్తి వెంకటరమణ, మెట్రో రైల్ పైన మైనంపల్లి చిత్రపటాలు ఏర్పాటు చేసి జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. వినూత్నంగా తెలియజేసిన ఈ జన్మదిన శుభాకాంక్షలు పట్ల మెట్రో ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చూశారు. దీంతోపాటు అనాధ పిల్లలకు ఆ రైల్ లో ఉచితంగా ప్రయాణం ఏర్పాటు చేశారు. అలాగే ఆ పిల్లలకు పండ్లు, బిస్కెట్లు, స్కూల్ బ్యాగ్ కిట్స్ ను అందజేశారు. ఒక నాయకుడి జన్మదిన పదిమందికి ఉపయోగకరంగా ఉండేటట్లు జరుపుకోవడాన్ని పలువురు ప్రయాణికులు అభినందించారు. నీరు పేదలకు అనునిత్యం అండగా ఉండే మైనంపల్లి ఆయురారోగ్యాలతో జీవించాలని మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని అరుణార్తి వెంకటరమణ ఆకాక్షించారు. ఈ సందర్భం. అసెంబ్లీ మెట్రో స్టేషన్ లో అనాధ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి మైనంపల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.