- Advertisement -
సంక్రాంతి తర్వాత నాగబాబు ప్రమాణం
Naga Babu swears after Sankranti
విజయవాడ, డిసెంబర్ 17, (వాయిస్ టుడే)
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. సచివాలయంలో దాదాపుగా అరగంట పాటు సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా రాజకీయ అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల రాజ్యసభ సభ్యులను ఖరారును చేసినప్పుడు జనసేన ప్రధాన కార్యదర్శి నాగేంద్ర బాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. నాగబాబు ప్రమాణ స్వీకార తేదీని ఖరారు చేసేందుకు పవన్ కల్యాణ్ చర్చించినట్లుగా తెలుస్తోంది. మంచి రోజలు చూసుకుని ఎప్పుడు ప్రమాణ స్వీకారానికి ఓకే అన్నా అప్పుడు గవర్నర్ కు సమాచారం పంపుతానని చంద్రబాబు సూచించినట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత ప్రమాణ స్వీకారం చేసేందుకు నాగబాబు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయం సీీఎం,డిప్యూటీ సీఎం మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అప్పుడే ఖరారు చేద్దామని చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తోంది. నాగబాబుకు రాజ్యసభ సీటు వస్తుందని అనుకున్నారు. రాజీనామాల వల్ల ఖాళీ అయిన మూడు సీట్లలో ఒకటి జనసేనకు వస్తుందనుకున్నారు. కానీ రాజీనామా చేసిన ఆర్ .కృష్ణయ్య బీజేపీలో చేరడంతో ఆయనకే సీటివ్వాల్సి వచ్చింది.తాజా రాజకీయ అంశాలపైనా, కూటమి పార్టీల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతల అంశంపైనా ఇరువురు నేతలు చర్చించినట్లుగా తెలుస్తోంది. వివాదాస్పద నాయకులను చేర్చుకుంటే అన్ని పార్టీల క్యాడర్ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తున్నందున ఇప్పుడల్లా చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడమే మంచిదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. వారు వైసీపీకి రాజీనామా చేసి కొంత కాలం సైలెంట్ గా ఉన్న తర్వాత పార్టీలో చేరే అంశంపై చర్చించవచ్చని అనుకుంటున్నారు. నాగబాబుకు కేబినెట్ లో చోటు ఖాయమమయింది. మంచి ముహూర్తం చూసుకుని రాజ్ భవన్ లో నాగబాబు చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అయితే అందుకు ముహూర్తం మాత్రం ఇంకా నిర్ణయం కాలేదు. మరో ఐదు నెలల్లో ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి నాగబాబుకు ఫిక్స్ అయింది. అయితే ఎమ్మెల్సీ అయిన తర్వాత నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారా? లేక ముందుగానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్సీని చేయాలా? అన్న విషయంపై ఆలోచించుకుని చెప్పాలని చంద్రబాబు పవన్ కల్యాణ్ కే వదిలేశారన్నది పార్టీ వర్గాల టాక్ కానీ దీనిపై కొంత ఆలోచన బయలుదేరిందంటున్నారు. ముందుగా మంత్రి పదవి చేపట్టి ఎమ్మెల్సీని చేస్తే కొంత వ్యతిరేకత వస్తుందా? రాదా? అన్న దానిపై పవన్ కల్యాణ్ పార్టీలోని కొందరు ముఖ్యులతో చర్చించినట్లు తెలిసింది. ఈలోపు టీడీపీపై గతంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో విపరీతంగా కొందరు ట్రోల్ చేస్తున్నారు. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటే తప్పుడు సంకేతాలు పంపినవారమవుతామని టీడీపీ నేతలు అభిప్రాయపడినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ టీడీపీ నేతలు,కార్యకర్తలు అసంతృప్తి వెళ్లగక్కినంత మాత్రాన చంద్రబాబు తన నిర్ణయాన్నివెనక్కు తీసుకోరు. యనమల వంటి వారు కూడా అసంతృప్తిని బహిరంగంగా లేఖ ద్వారా వెల్లడించింది ఇందుకేనా? అన్నఅనుమానాలు కూడా కలుగుతున్నాయిఅదే సమయంలో ఇంకా భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలోనూ ఇద్దరు నేతలు చర్చించినట్లుగా చెబుతున్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీతో పాటు బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన వారు కూడా కలసి పోటీ చేశారు. మంచి ఫలితాలు సాధించారు. వైసీపీ ఎన్నికల బహిష్కరణ చేయడంతో అన్నీ దాదాపుగా ఏకగ్రీవమయ్యాయి. త్వరలో జరగనున్ నసహకార సంఘాల ఎన్నికలు, అలాగే ఆ తర్వాత జరగనున్న పంచాయతీలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇలాగే సమన్వయంతో పని చేసి మంచి ఫలితాలు సాధించాలని అనుకున్నట్లుగా తెలుస్తోంది.
- Advertisement -