Sunday, January 25, 2026

నాగ చైతన్య అక్కినేని డెబ్యూ సిరీస్ ‘ధూత’ డిసెంబర్ 1న ప్రైమ్ వీడియోలో ప్రసారం 

- Advertisement -

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మించిన సిరిస్ ‘ధూత’.  సూపర్ నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో నాగ చైతన్య అక్కినేని ప్రధాన పాత్ర పోషించారు.  పార్వతి తిరువోతు, ప్రియా భవాని శంకర్,  ప్రాచీ దేశాయ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లోని  ప్రైమ్ మెంబర్స్ కు డిసెంబర్ 1 నుంచి  ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో సిరీస్‌లోని మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లు ప్రసారం కానున్నాయి.

ముంబై—నవంబర్ 15, 2023—భారతదేశంలో అందరూ ఇష్టపడే ఎంటర్ టైన్మెంట్ డెస్టినేషన్  ప్రైమ్ వీడియో, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు ఒరిజినల్ సూపర్‌నేచురల్ సస్పెన్స్-థ్రిల్లర్ ‘ధూత’ ప్రీమియర్ తేదీని ప్రకటించింది. ఈ సిరిస్ కు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు.  నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మించారు.  ‘ధూత’ నాగ చైతన్య అక్కినేని నటిస్తున్న తొలి వెబ్ సిరిస్. ఇందులో  సక్సెస్ ఫుల్  జర్నలిస్ట్ సాగర్ పాత్రను పోషిన్నారు. తనకి కొన్ని ఊహించిన సంఘటనలు, మిస్టీరియస్ మరణాల, అతీంద్రియ సంఘటనలు ఎదురై, అతని కుటుంబంపై నీడలా వెంటాడుతాయి. ఎనిమిది ఎపిసోడ్‌ల సిరీస్‌లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్ కీలక పాత్రలలో పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోనున్నారు. థ్రిల్లర్ డ్రామా ప్రత్యేకంగా భారతదేశంలోని ప్రైమ్ వీడియోలో,  ప్రపంచవ్యాప్తంగా 240 కంటే ఎక్కువ దేశాలులో డిసెంబర్ 1న ప్రసారం కానుంది. ధూత  ప్రైమ్ మెంబర్‌షిప్‌కి లేటెస్ట్ ఎడిషన్. ఇండియాలో ప్రైమ్ మెంబర్‌లు అన్నీ ఒకే మెంబర్‌షిప్‌లో కేవలం సంవత్సరానికి ₹1499కి సేవింగ్, సౌలభ్యం, వినోదాన్ని పొందుతారు.

naga-chaitanya-akkinenis-debut-series-dhoota-will-air-on-prime-video-on-1st-december
naga-chaitanya-akkinenis-debut-series-dhoota-will-air-on-prime-video-on-1st-december

“మా మొదటి లాంగ్-ఫార్మాట్ తెలుగు ఒరిజినల్ ‘ధూత’తో రిజినల్ పోర్ట్‌ఫోలియోను విస్తృతం చేయడం పట్ల మేము సంతోషిస్తున్నాము. జాతీయ అవార్డు-విజేత దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో  ఈ సిరిస్ సూపర్ నేచర్ల్  థ్రిల్లర్‌గా చివరి వరకు ప్రేక్షకులని మంత్రముగ్ధులను చేస్తుంది. నాగ చైతన్య అక్కినేని, పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్ ,ప్రాచీ దేశాయ్ అత్యుత్తమ తారాగణం ప్రేక్షకులని అలరించనుంది.  వారి పెర్ఫార్మెన్స్ లు కాంప్లెక్స్ లేయర్డ్, అనూహ్య కథనానికి ప్రాణం పోస్తాయి” అని హెడ్ అఫ్ ఒరిజినల్స్,  ఇండియా & సౌత్ఈస్ట్ , ప్రైమ్ వీడియో అపర్ణ పురోహిత్ అన్నారు. “మా కస్టమర్‌లకు ప్రత్యేకమైన, వైవిధ్యమైన  ఆకట్టుకునే కథనాలను అందించడమే మా లక్ష్యం. ఈ క్రమంలో ‘ధూత’ ఖచ్చితంగా  ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందిస్తుంది” అన్నారు.

నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. Ltd నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ.. “ధూత అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు సిరీస్‌లలో ఒకటి.  ఎంతో కాలం శ్రమ, అపారమైన అంకితభావం, అవిశ్రాంత ప్రయత్నాల ఫలితం. మొదటి నుంచీ, దర్శకుడు విక్రమ్ ఊహించినంత లోతుగా, వివరంగా ఒక కాన్సెప్ట్, కథ పూర్తి సామర్థ్యాన్ని చూపించే విధంగా సిరిస్ ని మలచాలని ముందే అనుకున్నాం. ధూత నాగచైతన్యకు గొప్ప స్ట్రీమింగ్ అరంగేట్రం అవుతుంది. ఈ విషయంలో మాకు ఎంతో ఆనందంగా వుంది. ముగ్గురు అసాధారణ మహిళా కథానాయకులు ఇందులో చాలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరిస్ తో  మునుపెన్నడూ లేని విధంగా, అసాధారణమైన పెర్ఫార్మెన్స్ లు, అనూహ్యమైన కథనంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అందిస్తున్న ప్రైమ్ వీడియోకు ధన్యవాదాలు” తెలిపారు.

తారాగణం:  నాగ చైతన్య అక్కినేని, పార్వతి తిరువోతు, ప్రియా భవాని శంకర్,  ప్రాచీ దేశాయ్ తదితరులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్