అరకు కాఫీ రుచి చూసిన నారా భువనేశ్వరి
అరకు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి బుధవారం అరకు లో పర్యటించారు. అరకు నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా అరకు కాఫీని నారా భువనేశ్వరి రుచి చూశారు. అరకు సెంటర్లోని అరకు గోల్డ్ కాఫీ సెంటర్ వద్ద అరకు కాఫీ తాగారు. అరకు కాఫీ గొప్పతనాన్ని భువనేశ్వరికి వివరించిన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దొన్నుదొర. చంద్రబాబు పాలనలో కాఫీ తోటలను ప్రత్యేకంగా ప్రోత్సహించారని భువనేశ్వరికి వివరించారు దొన్నుదొర. వైసీపీ అధికారంలోకి వచ్చాక కాఫీ తోటల పెంపకాన్ని గాలికొదిలేశారని అన్ఆరు. అరకు పర్యటక ప్రదేశాన్ని కూడా జగన్ సర్కార్ పట్టించుకోవడంలేదని భువనేశ్వరికి న్నుదొర తెలిపారు. అరకు ప్రకృతి అందాలను, ఆహ్లాదకరమైన ప్రదేశాలను కూడా భువనేశ్వరి పరిశీలించారు. అరకును పర్యాటక ప్రదేశంగా ప్రోత్సహించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆమె అన్నారు.
అరకు కాఫీ రుచి చూసిన నారా భువనేశ్వరి

- Advertisement -
- Advertisement -