- Advertisement -
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ముఖ్యంగా, ఆయన తమిళనాడు రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు.
తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె.అన్నామలైకు అనుకూలంగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఈ ప్రచారంలో భాగంగా, గురువారం రాత్రి ఏడు గంటలకు పీలమేడులో నారా లోకేష్ ప్రచారం చేయనున్నారు. అలాగే, శుక్రవారం కోయంబత్తూరులోని పారిశ్రామికవేత్తలతో ఆయన ప్రచారం చేయనున్నారు.రెండు రోజుల పాటు చేపట్టే నారా లోకేష్ ప్రచారంలో సభలు, రోడ్‌షోలు, సమావేశాల్లో పాల్గొంటారు. శుక్రవారం ఉదయం సింగానల్లూరులోని ఇందిరా గార్డెన్స్‌లో తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. కాగా, కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి అన్నామలై బరిలో ఉన్నారు. అక్కడ తెలుగువారు అధికంగా ఉండడంతో వారిని బీజేపీ వైపు తిప్పుకునేందుకు లోకేశ్‌తో ప్రచారం చేయించాలని బీజేపీ నిర్ణయించింది.
- Advertisement -



