Wednesday, March 18, 2026

గాంధీ పేరు తొలగించిన అభినవ గాడ్సే నరేంద్ర మోడీ :వైఎస్ షర్మిల

- Advertisement -

గాంధీ పేరు తొలగించిన అభినవ గాడ్సే నరేంద్ర మోడీ
కాంట్రాక్టర్లకు దోచి పెట్టేలా మోడీ కొత్త చట్టం చేశారు
మోదీ తెచ్చిన గ్రామ్ జీ చట్టం తో గ్రామ స్వరాజ్యం వినాశనం
వైఎస్ షర్మిల
శ్రీకాకుళం

Narendra Modi is a ‘Modern-day Godse’ who removed Gandhi’s name: YS Sharmila
ఏపీసీసీ ఛీఫ్ షర్మిలా రెడ్డి సోమవారం నాడు అముదాలవలస నియోజకవర్గం కొర్లకోట గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.
షర్మిల మాట్లాడుతూ
ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ నిర్వీర్యం చేసింది. గాంధీ పేరు తొలగించడం దారుణం . గాంధీ పేరు తొలగించిన అభినవ గాడ్సే మోడీ. గాంధీజీ మన జాతిపిత. పేరు తొలగించడం గాంధీజీ కి చేసిన అవమానం. గాంధీజీ సిద్ధాంతాలను ఖూనీ చేశారని అన్నారు.
విబి జి రామ్ జీ చట్టం అక్రమ చట్టం. పేద ప్రజల పొట్టగొట్టే చట్టం. మన్రేగా చట్టానికి గ్రామ్ జి చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మన్రేగా పథకం గ్రామాలను బాగుచేసిన పథకం. మన్రేగా చట్టం కింద పనుల నిర్ణయాధికారం గ్రామసభలది. మోడీ తెచ్చిన కొత్తచట్టంలో పనులు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది అంట. గ్రామాల్లో ఎం పనులు చేయాలో ఢిల్లీలో కూర్చున్న వాళ్లకు ఏం తెలుస్తుంది ?  ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు కేంద్రం కుట్రలు చేసింది. అందుకే కొత్త చట్టాన్ని తెచ్చింది. ఉపాధిలో ఊపిరి తీయాలని చూస్తున్నారు . 125 రోజుల పని కల్పన పచ్చి అబద్ధం. మన్రేగా కింద సగటున 52 రోజుల పని కల్పించలేకపోయారు. 52 రోజులు పని ఇవ్వలేని వాళ్ళు 125 రోజులు అంటే నమ్మాలా ?  గ్రామ్ జి చట్టం ఆంధ్రప్రదేశ్ కి పెనుభారం . 40 శాతం నిధులు రాష్ట్రంపై మోపడం ఏపీ భరిస్తుందా?   గ్రామ్ జి చట్టం రాష్ట్రానికి 5 వేల కోట్ల భారం. గ్రామ్ జి చట్టంతో రాష్ట్రంపై భారం పడుతుంటే చంద్రబాబు మద్దతు ఇవ్వడం దుర్మార్గమని అన్నారు.
రాష్ట్ర అభివృద్ధిపై ఎవ్వరికీ చిత్తశుద్ధి లేదు. మన్రేగా చట్టం మీద పోరాటం ఉధృతం చేయాలి. రాష్ట్ర ప్రజలు పూర్తి మద్దతు ఇవ్వాలి. రాష్ట్రంలో మార్పు రావాలి అంటే మీరు చేయి చేయి కలపాలి. కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలి. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్  అధికారంలో వస్తే మార్పు వస్తుంది. కాంగ్రెస్ అధికారంలో వస్తే రాష్ట్రం బాగుపడుతుంది . కాంగ్రెస్ పాలనతోనే రాష్ట్రంలో సువర్ణ అధ్యాయం మొదలు అవుతుందని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్