అంతరిక్షంలోకి  రోబో పామును రూపొందించిన ‘నాసా’

- Advertisement -

ఈ ఆలోచన వెనుక భారత సంతతికి చెందిన ఇంజినీర్‌

nasa-has-created-a-robot-snake-in-space
nasa-has-created-a-robot-snake-in-space

కాలిఫోర్నియా, నవంబర్‌ 16: భారత్‌లో కనిపించే కొండచిలువ ఆకారం, అది కదిలే తీరును స్ఫూర్తిగా తీసుకొని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ఓ రోబోను రూపొందించింది. మార్స్‌, చంద్రుడిపై ఎలాంటి ప్రదేశాల్లోనైనా సంచరించేలా దీన్ని రూపొందిస్తున్నది. ఈ ఆలోచన వెనుక భారత సంతతికి చెందిన ఇంజినీర్‌ ఉండటం గమనార్హం.నాగ్‌పూర్‌లో బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన రోహణ్‌ టక్కర్‌ ప్రస్తుతం నాసాలో పనిచేస్తున్నారు. ‘ఎగ్జోబయోలజీ ఎక్స్‌టంట్‌ లైఫ్‌ సర్వేయర్‌’ పేరుతో పిలుస్తున్న ఈ పాము తరహా రోబో ఆలోచన ఈయనదే. పగుళ్లు, గుహలు, నీటి లోపల, గురుకైన ప్రదేశాల్లోనూ ఇది ప్రయాణించగలదని రోహణ్‌ టక్కర్‌ వెల్లడించారు. ఇతర గ్రహాలపై జీవాన్వేషణలో ఇది తోడ్పాటునందిస్తుందని నాసా భావిస్తున్నది. విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాల్లోనూ ఉపయోగించుకునే వెసులుబాటు ఉందని రోహణ్‌ టక్కర్‌ వివరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular