జాతీయ గణిత దినోత్సవం

- Advertisement -

జాతీయ గణిత దినోత్సవం

సంఖ్య శాస్త్రంలో రామానుజన్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1962వ సంవత్సరంలో రామానుజన్ 75వ జన్మదినం. నాడు స్మారక తపాలా బిళ్ళను విడుదల చేయడమే కాకుండా 125వ

జయంతి సందర్భంగా 2012 జాతీయ గణిత శాస్త్ర సంవత్సరముగా ప్రకటించింది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాల నందు గణిత

శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుల బృందం, విద్యార్థి,

విద్యార్థినిలుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ గణిత అన్ని శాస్త్రాలకు తల్లి వంటిది. గణితశాస్త్రం లేకుండా ఈనాడు ప్రపంచం ఏ రంగాలలోనూ ముందంజ

వెయ్యలేదు. దైనందిన సమస్యల పరిష్కారానికి గణితం ఎంతో ఉపయోగపడుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో,ఎక్కడ ఏ పరిశోధనలకు గణితం ప్రాతినిధ్యం వహిస్తున్నది. గణితం కృత్రిమ మేడ ఆర్టిఫిషల్

ఇంటెలిజెన్స్, బిగ్ డేటా,మిషన్ లెర్నింగ్, సైబర్ భద్రత,వంటి వివిధ రంగాలలో కొత్త పరిశోధనలకు సమస్య పరిష్కారానికి గణితం ప్రధానం. గణితములో సమస్యలను అధిగమించి, పరిష్కరించి, అన్ని

సాంకేతిక రంగాలలో వినూత్న మార్పులు, శాస్త్రజ్ఞులు తేవటం, జరుగుతుంది. గణితం ప్రతి అంశం లేదా రూపం ప్రతిరోజు మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. ప్రజలు పనిచేసే రంగాలలో అది వైద్యం,

వాతావరణ శాస్త్రం, లేదా క్రెప్టోగ్రఫీ దాని ప్రభావాన్ని చూస్తాము. అంతరిక్షంలో జీవం యొక్క సంభావ్యతను నిర్ణయించడానికి,  దీనిని ఉపయోగిస్తారు. గణాంక శాస్త్రవేత్తలు జనాభా దొరనులను అంచనా

వేయడానికి,సమాచారం (డేటా) పై ఆధారపడతారు. ఒక సంస్థ బాగా పని చేస్తుందో లేదా నష్టాలను తెలుసుకోవడానికి, అకౌంటెంట్లు దీనిని ఉపయోగిస్తారు. గణితం లేకపోతే ప్రపంచం పురోగతి సాధించలేదు.

అని పలు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular