జాతీయ ఓబీసీ పోస్టర్ల ఆవిష్కరణ :*ఎంపీ వద్దిరాజు

- Advertisement -

*ఎంపీ వద్దిరాజు జాతీయ ఓబీసీ పోస్టర్ల ఆవిష్కరణ*
వాయిస్ టుడే:

National OBC posters unveiled: MP Vaddiraju
National OBC posters unveiled: MP Vaddiraju
National OBC posters unveiled: MP Vaddiraju

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అఖిల భారత జాతీయ ఓబీసీ 10వ మహాసభ పోస్టర్లు,కరపత్రాలను ఆవిష్కరించారు.ఎంపీ రవిచంద్ర బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, చిన్న శ్రీశైలం యాదవ్,బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఉప్పల వెంకటరమణ, హైకోర్టు సీరియస్ న్యాయవాది చెరుకూరి శేషగిరిరావు,మున్నూరుకాపు ప్రముఖుడు జైపాల్ రెడ్డి తదితరులతో కలిసి పోస్టర్లు , కరపత్రాలను ఆవిష్కరించారు.బీసీ రిజర్వేషన్స్ ఆరాధ్యుడు “బీపీ మండల్ డే”సందర్భంగా జాతీయ ఓబీసీ 10వ మహాసభ ఆగస్ట్ 7వతేదీన గోవాలోని సాంటక్రూజ్ వద్ద ఉన్న శ్యాంప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది.”ఛలో గోవా” పేరుతో నిర్వహిస్తున్న ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరు కావలసిందిగా ఎంపీ వద్దిరాజును సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, చిన్న శ్రీశైలం యాదవ్ తదితర ప్రముఖులు శాలువాతో సత్కరించి సాదరంగా ఆహ్వానించారు.పోస్టర్ల ఆవిష్కరణ సందర్భంగా “జై బీసీ జైజై బీసీ”,”వర్థిల్లాలి వర్థిల్లాలి బీసీ ఐక్యత వర్ధిల్లాలి”,”సాధిద్ధాం సాధిద్ధాం రాజ్యాధికారం సాధిద్ధాం”అంటూ నినదించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular