Monday, October 14, 2024

కేసీఆర్ కు జాతీయ రాజకీయాలా…

- Advertisement -

హైదరాబాద్, నవంబర్ 4, (వాయిస్ టుడే  ):  బీజేపీ గోషామహాల్ ఎమ్మెల్యే అభ్యర్థి రాజాసింగ్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో వరల్డ్ కప్ జరుగుతోంది.. మన టీం అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది.. అలాగే, తెలంగాణ ఎన్నికల సందర్భంగా తనను బ్యాట్స్ మెన్ గా నన్ను పంపించారు అని ఆయన పేర్కొన్నారు. ఛతీస్ గఢ్, రాజస్థాన్ లో కాంగ్రెస్ ఎంతో దోచుకుంది.. అవినీతి చేసి కూరుకుపోయింది.. రాజస్థాన్ సచివాలయంలో కోట్లు, కిలోల కొద్దీ బంగారం దొరికింది.. విదేశాల నుంచి డబ్బులను ఎన్నికల కోసం తెప్పిస్తోంది.. వచ్చే ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది అని అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు.మహాదేవ్ యాప్ పేరిట కాంగ్రెస్ అవకతవకలకు పాల్పడుతోంది అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. మహాదేవ్ యాప్ పేరుతో దేవుడి పేరును చెడగొట్టారు.. మహాదేవ్ యాప్ పేరిట 508 కోట్లు ఛతీస్ గఢ్ సీఎం భూపేష్ భాగేల్ కు అందాయి.. కాంగ్రెస్ గ్యారెంటీలు వర్కవుట్ అవ్వడం లేదు.. అబద్ధపు కాంగ్రెస్.. అబద్ధపు గ్యారెంటీలు.. కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఎన్నికల కోసం విదేశాలు, మహాదేవ్ యాప్, కర్ణాటక నుంచి తీసుకొస్తున్నారు అని ఆయన విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఆలస్యం చేయడం వల్ల ఎంతోమంది మరణించారు.. పార్లమెంట్ లో సోనియా, కాంగ్రెస్ నేతలు ఎలా వ్యవహరించారో నాకు తెలుసు.. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి చేస్తారని అనుకుంటే ఆయన కూడా నిరుద్యోగులను మోసం చేశారు అని అనురాగ్ ఠాకూర్ ధ్వజమెత్తారు.10 ఏండ్ల తర్వాత ఇప్పుడు పార్టీ పేరు మార్చి దేశ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు అని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కేసీఆర్.. జాతీయ రాజకీయాలు చేద్దామనుకుంటే.. ఆయన బిడ్డ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో జాతీయ స్థాయి వార్తల్లో నిలిచింది.. తెలంగాణలో అంత తిన్నా సరిపోలేదని బిడ్డను ఢిల్లీకి పంపాడు.. లిక్కర్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు అని ఆయన ఆరోపించారు. తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరు.. ప్రతి ఒక్కరి నంబర్ వస్తుంది.. అప్పుడు వాళ్ళు కూడా జైలుకు పోవాల్సిందే.. గొప్పలు చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది.. కాళేశ్వరం బిగ్గెస్ట్ ఇంజినీరింగ్ బ్లండర్ అంటూ కేంద్రమంత్రి ఠాకూర్ మండిపడ్డారు.పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు.. పరివార్ సర్వీస్ కమిషన్ అని అనురాగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజస్థాన్ లో గెహ్లాట్ సర్కార్ కాదు.. గెహ్ లూట్ సర్కార్.. కాళేశ్వరం ప్రాజెక్టుకు 80 వేల కోట్ల ప్రాజెక్టు అయితే లక్ష కోట్ల కరప్షన్ జరిగిందని అంటున్నారని మంత్రి కేటీఆర్ అంటున్నారు.. అంటే కరప్షన్ జరిగినట్లు అయితే ఒప్పుకున్నట్లే కదా.. మరి ఎంత అవినీతి జరిగిందో ఆయన తన తండ్రి కేసీఆర్ ను అడిగి చెప్పాలి అని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాదు.. కవిత పేరు ఢిల్లీ లిక్కర్ కేసులో ఉంది.. ఢిల్లీ ఉపముఖ్యమంత్రినే విడిచి పెట్టలేదు.. కవితను ఎలా విడిచిపెడతాం..కాంగ్రెస్.. రామభక్తులపై బుల్లెట్లు దింపింది.. కేసీఆర్ నీకు దమ్ముంటే నువ్ గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా.. దళిత సీఎం, దళితులకు మూడెకరాలు, డబుల్ బెడు రూమ్స్ ఇస్తామన్న ఉద్యోగాలు ఏమయ్యాయని అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్