ఏపీ నిట్ లో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం

- Advertisement -

తాడేపల్లిగూడెం:  తాడేపల్లిగూడెం…భారత దేశమంతటా ఒక్కటిగా ఉండాలని, దేశంలోని  సంస్థానాల ఐక్యతకు పాటుపడిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి తెలిపారు. ఏపీ నిట్ ప్రాంగణంలోని పరిపాలనా భవనం వద్ద జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని (రాష్ట్రీయ ఏక్తా దివాస్) మంగళవారం ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్బంగా దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల  విధానాలకు వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుల్లో పటేల్ ఒకరని కొనియాడారు. భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్దించిన తరువాత దేశంలోని సంస్థానాలన్నింటిని ఒకే తాటిపైకి తీసుకొచ్చే భాధ్యతను తీసుకుని సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. దేశ సమగ్రత, సమైఖ్యతకు ఎంతగానో పాటుపడి ఉక్కు మనిషిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కీర్తించబడ్డారని వివరించారు.  బోధన, భోదనేతర సిబ్బందితో  రిజిస్ట్రార్ ప్రతిజ్ఞ చేయించారు. ముందుగా పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీన్ లు డాక్టర్ జీబి వీరేష్ కుమార్, డాక్టర్ టి.కురుమయ్య, డాక్టర్ జి.ఆర్.కె శాస్త్రి, ఆచార్యులు డాక్టర్ వి.సందీప్, డాక్టర్ కిరణ్ తీపర్తి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular