దేశవ్యాప్తంగా 9..  రాష్ట్రానికి 2 వందే భారత్ రైళ్లు

- Advertisement -

వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించిన  మోదీ

న్యూఢిల్లీ:సెప్టెంబర్ :  దేశవ్యాప్తంగా 9 వందే భారత్‌ రైళ్లు ఆదివారం పట్టాలెక్కాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా జెండా ఊపి వందే భారత్ రైళ్లను ప్రారంభించారు.

ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9 వందే భారత్ రైళ్లను ఫ్లాగ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ప్రయాణ సౌలభ్యంపై కేంద్రం దృష్టి సారించిందని గత ప్రభుత్వాలు రైల్వేకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 25 వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు మరో 9 వందే భారత్‌ రైళ్లు ప్రారంభం అయ్యాయి.

Nationwide 9.. 2 Vande Bharat trains per state
Nationwide 9.. 2 Vande Bharat trains per state

త్వరలోనే దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించే దిశగా కార్యచరన రూపొందిస్తున్నాం. భారతీయ రైల్వే బడ్జెట్‌ను కూడా కేంద్రం పెంచింది. మల్టీ-మోడల్ కనెక్టివిటీపై కూడా ప్రభుత్వం పనిచేస్తోంది.

వేగం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా వందే భారత్‌ రైళ్లు పనిచేస్తున్నాయి. కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగానికి ఇది ఒక ఉదాహరణ’ అంటూ ప్రధాని మోదీ కార్యక్రమంలో ప్రసంగించారు.

తాజాగా ప్రారంభించిన 9 వందే భారత్ రైళ్ల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. కాచిగూడ- యశ్వంత్‌పూర్‌, విజయవాడ-ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకుని కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

Nationwide 9.. 2 Vande Bharat trains per state
Nationwide 9.. 2 Vande Bharat trains per state
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular