నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’

- Advertisement -

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ, డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్న ఎస్‌వీసీ, షూటింగ్ లో జాయిన్ అయిన ఎస్ జే సూర్య

నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెండోసారి కలిసి పని చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘సరిపోదా శనివారం’లో నానిని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎస్‌వీసీ సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా గ్రాండ్ గా విడుదల చేయబోతుంది.ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో వెర్సటైల్ యాక్టర్ ఎస్ జే సూర్య కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యుల్ లో ఎస్ జే సూర్య జాయిన్ అయ్యారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర డైనమిక్ గా ఉండబోతుంది.ఇప్పటికే విడుదలైన సరిపోదా శనివారం అన్‌చెయిన్డ్ వీడియోకుట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నాని సినిమాలో రగ్గడ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించనున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్.
పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్ జే సూర్య

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular