ఈ నెల 15న కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్న నీలం మధు

- Advertisement -
Neelam Madhu is joining Congress party on 15th of this month

ఎన్ఎంఅర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ మంత్రి దామోదర రాజనర్సింహ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 15న కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్న సంధర్బంగా మంత్రి దామోదర  ఆశీస్సులు తీసుకున్నారు. పుష్పగుచ్చం అందించి మంత్రి ని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నీలం మధు చేరిక పట్ల మంత్రి దామోదర రాజనర్సింహ  సానుకూలత వ్యక్తం చేస్తూ పార్టీ లోకి రాకను స్వాగతించారు.యువ నాయకుడు నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పార్టీకి శుభపరిణామమన్నారు. నీలం మధు రాకతో పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నియోజక వర్గంలో పార్టీకి మేలు చేకూరుతుందన్నారు.
పటాన్ చెరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ నాయకులు, కార్యకర్తలతో ఐక్యమత్యంతో పని చేయాలని సూచించారు. మంత్రి  సూచనలను విన్న నీలం మధు మంత్రి దామోదర  అదేశాలకనుగుణంగా పార్టీ అభివృద్ధికి కంకణబద్ధుడినై పని చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలతో అందరిని కలుపుకుని మెదక్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడంలో తన వంతు పాత్రను సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు. మంత్రి సహకారంతో ప్రజల పాలనలో బాగస్వామినై ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలకు సేవ చేస్తానని, పటాన్ చెరు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని స్పష్టం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular