మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సల్లగా ఉండాలని నీలం మధు ముదిరాజ్

- Advertisement -

మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సల్లగా ఉండాలని నీలం మధు ముదిరాజ్ అన్నారు

పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామంలో నిర్వహించిన మల్లన్న స్వామి జాతరలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో నిర్వహించే జాతరలు ఉత్సవాలతో గ్రామాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడంతో పాటు గ్రామస్థుల మధ్య ఐక్యమత్యం వెల్లివిరుస్తుందని తెలిపారు. అనాదిగా వస్తున్న మన ఉత్సవాలను, జాతరాలను ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. మలన్న స్వామి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని ఆ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, జాతర నిర్వాహకులు, గ్రామ పెద్దలు, ప్రజలు,ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular