బిపిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతక వ్యాదులు
సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో రక్తపోటు దినం
జగిత్యాల
రక్తపోటును నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతక వ్యాధులకు గురవుతారని హైదరాబాద్ కు చెందిన ప్రముఖ డాక్టర్ మల్లేశం అన్నారు.శుక్రవారం తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో “ప్రపంచ రక్తపోటు దినం” అసోసియేషన్ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు.ఈ సందర్భంగా రక్తపోటు పెరగడానికి కారణాలు,నియంత్రణకు మార్గాలు,రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో డాక్టర్ మల్లేశం మాట్లాడుతూ వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ చొరవతో2005 లో ప్రారంభమై ప్రతి ఏటా మే 17 రోజున ప్రపంచ రక్తపోటు దినం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు.రక్తపోటుకు కారణాలుగా పొగాకు ఉత్పత్తుల వాడకం,
మధుమేహం ఉండడం,
కొలెస్ట్రాల్ అధికమవడం,స్థూల కాయం,ఉప్పు అధిక వినియోగం,ఆల్కహాల్ సేవనం,అధిక మానసిక ఒత్తిడి,అనువంశిక కారణాలు లాంటివన్నారు.బి.పి.ని నియంత్రణకు ఆకు కూరలు,
పాలు/పెరుగు,ఓట్ మీల్,అరటి పండ్లు,చేపలు,గోధుమలు,టమాట,జొన్నలు,గ్రీన్ పీస్,ఉల్లి,బొప్పాయి పండు,
ఉసిరి,మజ్జిగలను,ఓట్స్ లాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు
.ఉప్పు,జంక్ ఫుడ్,చక్కర,
కొవ్వులను పూర్తిగా తగ్గించాలన్నారు.పొగాకు,ఆల్కహాల్,ఉప్పు వాడకాలను కూడా పూర్తిగా తగ్గించాలన్నారు.
వ్యాయామం,నడక,యోగ,ధ్యానం,6,7 గంటల మధ్య నిద్ర ఉండాలన్నారు.లిఫ్ట్ కు బదులు మెట్ల మార్గాన్ని ఆశ్రయించాలన్నారు.ఇంటి భోజనంను మాత్రమే తీసుకోవాలన్నారు.సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ బి.పి.అంటువ్యాధి కాదని,మన అలవాట్లతో నివారించడం,నియంత్రణ చేయవచ్చన్నారు.బి.పి.రాకుండా పరిపూర్ణమైన జీవన శైలిని పాటిస్తూ రక్తపోటు సమస్య లేని భారతాన్ని నిర్మించుటలో మనందరం సహకరిద్దామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విష్వనాథం,ఉపాధ్యక్షులు బొల్లం విజయ్,పి.హన్మంత రెడ్డి,
ఎం.డి.యాకూబ్,కోశాధికారి వెలముల ప్రకాష్ రావు, సంయుక్త కార్యదర్శి బోబ్బాటి కరుణ,ఆర్గనైజింగ్ కార్యదర్శులు ఆశోక్ రావు,సత్యనారాయణ, రాజ్ గోపాల్ చారి, జగిత్యాల పట్టణ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది పి.సతీశ్ రాజ్, కోశాధికారి సింగం గంగాధర్,కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం,కార్యదర్శి గంటేడి రాజ్ మోహన్,ధర్మపురి అధ్యక్షుడు కండ్లే గంగాధర్,
రాయికల్ అధ్యక్షుడు సాయన్న,మెట్ పల్లి అధ్యక్షుడు ఒజ్జల బుచ్చిరెడ్డి,కథలాపూర్ అధ్యక్షుడు బాపు రెడ్డి,
సారంగపూర్ అధ్యక్షుడు కాలగిరి గంగ రెడ్డి,మేడిపల్లి కార్యదర్శి ఎం.డి.బురాణొద్దీన్,
జిల్లా,డివిజన్,మండల,గ్రామాల సీనియర్ సిటిజెన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.