- Advertisement -

ములుగు బహిరంగ సభలో రాహుల్, ప్రియాంక. రామప్ప లాంటి అందమైన గుడిని ఎప్పుడూ చూడలేదు. తెలంగాణ ఇస్తే రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సోనియాకు తెలుసు. రాజకీయ లబ్దికోసం కాకుండా, తెలంగాణ ప్రజల కోరిక మేరకు ఆ నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాంతాచారికి నా నివాళి. ఉద్యోగాలు, నిధుల కోసం మీరు కలలు కన్నారు. మీ కలలు సాకారం అవుతాయని బీఆర్‌ఎస్‌ను నమ్మి ఓటేశారు. ఉద్యోగాలు వస్తాయని పిల్లల భవిష్యత్ మారుతుందని అనుకున్నారు. మీ కలను కాంగ్రెస్ అర్థం చేసుకుంది. సామాజిక న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్ సిద్ధాంతం.

- Advertisement -


