వారంలో కొత్త బాస్
నల్గోండ, జూన్ 28,
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తా రంటూ కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. స్టే ట్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఎవరనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నె లకొంది. అయితే ఈ సస్పెన్స్‌కు మరో వారంలో బ్రేక్ పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. హైకమాండ్ ఎవరికి చాన్స్ ఇవ్వనుందనేది హాట్ టాపిక్‌గా మారింది. ఆది నుంచి మల్కాజిగి రి ఎంపీ ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.తెలంగాణలో 8 స్థానాల్లో కాషాయ పార్టీ గెలుపొందడంతో హైకమాండ్ ఇద్దరిని కేంద్ర మంత్రులను చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖను కేటాయించింది. బండి సంయ్‌ని కేంద్ర హోంశాఖ సహాయ మం త్రిగా నియమించింది. కేంద్ర మంత్రిగా నియమించడంతో పాటు కిషన్ రెడ్డిని జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఇన్‌చార్జిగా సై తం ఇటీవలే నియమించింది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన దాదాపు 20 రోజుల వరకు తెలంగాణకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ మూడు వారాలు టైం గ్యాప్ ఉండటంతో పార్టీ వ్యవహారాలకు ఇబ్బందిగా మారే చాన్స్ ఉందని సమాచారం.టీ బీజేపీ కొత్త ప్రెసిడెంట్ పోస్టు కోసం ఎవరికి వారుగా పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నియామకంపై ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. పార్టీలో సీనియర్లకు ఇవ్వాలని కొందరు అంటుంటే.. ఇంకొందరు దమ్మున్న నేతల అవసరం అనివార్యమని చెబుతున్నారు. ఈ తరుణంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నపళంగా హస్తినకు బయలుదేరడం చర్చనీయాంశమైంది. ఆయన బీజేపీ అగ్రనేతలతో భేటీ అయిన ట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఎలాంటి అంశాలు పెద్దలకు వివరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. హైకమాండ్ సైతం ఈ అంశానికి వీలైనంత త్వరగా చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వారంలో కొత్త ప్రెసిడెంట్ ఎవరనేది తేలనుంది. మరి హైకమాండ్ వారంలో కొత్త సారథిని ప్రకటిస్తుందా? లేక ఇంకా సస్పెన్స్‌లోనే ఉంచుతుందా? అనేది చూడాలి.
వారంలో కొత్త బాస్
- Advertisement -
- Advertisement -