ఏడు రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్
New railway line in seven states
న్యూఢిల్లీ, ఆగస్టు 10,
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా రైల్వే లైన్ల నిర్మాణానికి ఓకే చెప్పింది మొత్తం పాతిక వేల కోట్ల అంచనాలతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, బిహార్‌లో కొత్త రైల్వే లైన్‌లు నిర్మించనున్నారు. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రైల్వే లాన్‌లలో ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు ఒక కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నారు. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఈశాన్య, తూర్పు రాష్ట్రాలతో కనెక్టవిటీ పెరుగుతుందని అంటున్నారు. అంతే కాకుండా ఒడిశా నుంచి బొగ్గు, ఇనుప ఖనిజ సరఫరా కూడా చాలా సులభతరమవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్త 4,109 కోట్లతో రెండు వేల కిలోమీటర్లకుపైగా ఈ కొత్త లైన్‌ను నిర్మించనున్నారు. దీంతోపాటు కేంద్రం మరో ఏడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఆమోదించింది. రూ.24,657 కోట్ల ఖర్చుతో ఏడు రాష్ట్రాల అనుసంధానం మరింత ఈజీ అవుతుంది. 900 కిలోమీటర్లు, 54 స్టేషన్లు,14 జిల్లాలను టచ్ చేస్తూ ఈ లైన్‌లు ఏర్పాటు చేస్తారు. వీటిని ఐదేళ్లలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు. గిరిజన ప్రాంతాలను ఇతర ప్రాంతాలతో అనుసంధానించేలా ఈ లైన్‌లు ప్లాన్ చేశామని రైల్వే మంత్రి వైష్ణవ్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉప కులాల వర్గీకరణపై కూడా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగం సూచినట్టుగానే ఈ తీర్పును అమలు పరిచేలా చూడాలని భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీల్లో వర్గీకరణలో క్రీమీలేయర్‌ను అమలు చేయకూడదని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కొందు బీజేపీ ఎంపీలు ఈ వర్గీకరణపై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నేతలు చెప్పారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద గ్రామాల్లో రెండు కోట్ల ఇళ్లు, పట్టణాల్లో కోటి ఇళ్లు నిర్మాణానికి ఓకే చెప్పింది. గ్రామాల్లో ఇళ్ల నిర్మాణానిటి మూడు లక్షలు, పట్టణాల్లో మూడు లక్షలు ఇవ్వనుంది. హార్టీ కల్చర్ ను ప్రోత్సహించేందుకు క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ ను తీసుకొస్తోంది. దీని కోసం 1766 కోట్లు ఖర్చుపెట్టనుంది.