Monday, March 24, 2025

ఫార్ములా రేసులో కొత్త మలుపులు

- Advertisement -

ఫార్ములా రేసులో కొత్త మలుపులు

New twists in formula race

హైదరాబాద్, జనవరి 3, (వాయిస్ టుడే)
అవినీతే లేనప్పుడు కేసు ఏంటి. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు. కేసులో అస్సలు పస లేదు. అదో లొట్టపీసు కేసు అంటూ ఫార్ములా ఈ – రేస్‌ వ్యవహారంపై కేటీఆర్ ఏవేవో మాట్లాడారు. కానీ, తెర వెనుక కథంతా నడిపిస్తున్నారు. ఏసీబీ కేసు నుంచి తప్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూనే, ఈడీ కేసు విషయంలోనూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈడీ నోటీసుల ప్రకారం, కేసులో ఏ3గా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి  విచారణకు హాజరు కావాలి. కానీ, రాలేదు. తనకు గడువు కావాలని లేఖ రాశారు. అదే బాటలో ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా ఈడీకి లేఖ పంపారు. వీరి లేఖలపై స్పందించిన అధికారులు 8న బీఎల్ఎన్ రెడ్డి, 9న అరవింద్ హాజరవ్వాల్సిందేనని నోటీసులు ఇచ్చారు. అయితే, విచారణకు డుమ్మా వెనుక కేటీఆర్ చక్రం తిప్పినట్టుగా తెలుస్తోంది.ఫార్ములా ఈ – రేస్ వ్యవహారంలో రూల్స్‌కు విరుద్ధంగా ప్రజాధనం ట్రాన్స్‌ఫర్ అయింది. అదికూడా పన్నురూపంలో ఎక్కువ మొత్తంలో ఖర్చుచేసి మరీ ఇచ్చారు. దీని వెనుక కర్త, కర్మ, క్రియ అన్నీ కేటీఆర్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియా సమక్షంలో పలుమార్లు ఒప్పుకున్నారు. కానీ, ఏసీబీ కేసుపై హైకోర్టును ఆశ్రయించి, తనకేం తెలియదని అంతా అధికారులేనంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఈడీ కూడా దూకుడుగా వ్యవహరించడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఈనెల 7న విచారణకు రావాలని ఈడీ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు పంపారు. వెళ్లాలా వద్దా? అనే అయోమయంలో ఉన్న కేటీఆర్, లాయర్లతో చర్చలు జరుపుతున్నారు.కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ కంటే ముందే ఏ2, ఏ3 అయిన అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించారు. కానీ, అనూహ్యంగా వారిద్దరూ తమకు సమయం కావాలని కోరారు. అదికూడా కేటీఆర్‌ను విచారించే తేదీకి తర్వాతే వస్తామని చెప్పారు. దీంతో తనకంటే ముందే వారిద్దరు విచారణకు వెళ్తే ఉచ్చు బిగుసుకుంటుందనే కేటీఆర్ వారిని వెళ్లనివ్వలేదన్న చర్చ జరుగుతోంది. తాను హాజరయ్యాకే వారిద్దరూ ఈడీ ముందుకు వెళ్లేలా చేస్తే, కేసు నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంటుందనేది కేటీఆర్‌ ప్లాన్‌గా అనుకుంటున్నారు.ఎందుకంటే, తన కంటే ముందే ఏ2, ఏ3 వెళ్తే వారి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. దాని ప్రకారం ప్రశ్నలు ఉంటాయి. లేదంటే వ్యూహాత్మకంగా గుచ్చిగుచ్చి అడుగుతారు. అప్పుడు ఏం చెప్పినా ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉంటుంది. అందుకే, బీఎల్‌ఎన్ రెడ్డిని, అరవింద్‌ను కేటీఆర్ ఇప్పుడు విచారణకు వెళ్లకుండా ఆపారని అంతా అనుకుంటున్నారు. అయితే, కేటీఆర్ నిర్ణయంతో బీఎల్‌ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ అసంతృప్తిలో ఉన్నట్టుగా కూడా చర్చ జరుగుతోంది.ఈడీ షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు విచారణ జరగడం లేదు. కావాలని ఆలస్యం చేశారు. అదికూడా కేటీఆర్ విచారణ తర్వాతే వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు. దీనివల్ల కొత్త చిక్కులు వచ్చే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. ఈడీ అధికారులు నిఘా పెంచి విచారణ సమయంలో మరిన్ని చిక్కు ప్రశ్నలు వేసే అవకాశం ఉందంటున్నారు. బీఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్‌కు ఇది తలనొప్పి వ్యవహారమేనని అంచనా వేస్తున్నారు. మరోవైపు, లొట్టపీసు కేసు అంటూనే తెర వెనుక చేస్తున్న డ్రామాలు చూస్తుంటే, కేటీఆర్ భయం భయంగా ఉన్నట్టుగా అర్థం అవుతోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్