న్యూ ఇయర్ గిఫ్ట్ ..
New year gift..
ఏపీలో ఒక రోజు ముందే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ
63.75 లక్షల మందికి రూ. 2717కోట్లు పంపిణీ
దేవినేని ఉమామహేశ్వర రావు
గొల్లపూడి
సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారని, స్పౌజ్ కేటగిరి కింద కొత్తగా 5,402 మంది వితంతువులకు పింఛను మంజూరు చేసినట్లు ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం గొల్లపూడి సాయిపురం కాలనీలో స్థానిక నేతలతో కలసి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత 3నెలల వ్యవధిలో వివిధ రకాల కారణాలతో పెన్షన్ తీసుకోకుండా ఉన్న 50 వేల మందికి సైతం బకాయిలతో సహా అందించనున్నట్లు వివరించారు. ఎన్టీఅర్ గారు మొదలు పెట్టిన 75 రూపాయల పింఛన్ల ఈ రోజు నెలకు 4వేలు అయ్యిందని ఈ సందర్భంగా గుర్తు చేసారు.
ఐదేళ్ల పాటు వైసీపీ అరాచకాలతో రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిసర్వ నాశనసం చేసిందని, థఃపాతాళానికి పడిపోయిన రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ చొరవతో మళ్లీ ఊపందుకుంటోందన్నారు. ఐదేళ్ల పతనం తర్వాత సీఎం చంద్రబాబు నేతృత్వంలో పునరుత్థానం దిశగా నవ్యాంధ్ర పయనం ప్రారంభిమైందన్నారు. 74ఏళ్ల వయస్సులో సీఎం చంద్రబాబు 18 గంటలు పైగా కష్టపడుతున్నారని, ప్రతి కార్యకర్త నాయకుడు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
2047 నాటికి తలసరి ఆదాయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ కావాలనే విషయాన్ని సీఎం చంద్రబాబు వివరించారని, ప్రజలూ తమ కుటుంబం 2047 ఏడాది నాటికి ఎలా ఉండాలో ఒక ఆలోచన చేయాలని, విజన్ తయారు చేసుకోవాలని చంద్రబాబు కోరినట్లు తెలిపారు.
ఇప్పటికే గోదావరి కృష్ణాను అనుసంధానం చేసి లక్షల ఎకరాలకు ప్రయోజనం కల్పించామని గుర్తు చేశారు. గోదావరి-పెన్నా అనుసంధానంతో రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుందన్నారు.