Sunday, February 9, 2025

న్యూ ఇయర్ వేడుకలు సంతోషంతో జరుపుకోవాలి

- Advertisement -

న్యూ ఇయర్ వేడుకలు సంతోషంతో జరుపుకోవాలి

New Year should be celebrated with joy

శ్రీశైలం వన్ టౌన్ సిఐ ప్రసాద్ రావు

(శ్రీశైలం
న్యూ ఇయర్ ఈవెంట్స జరుపుకునేవారు ముందుగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి.మరియు CC కెమరాల పర్యవేక్షణ తప్పనిసరి.
నూతన సంవత్సర వేడుకలు ప్రజలందరూ ఆరోగ్య కరమైన వాతావరణంలో జరుపుకోవాలని, జిల్లా అంతట 30 పోలీస్ ఆక్ట్ అమలు లో ఉన్నందున ప్రజలందరూ పోలీస్  నిబంధనలు పాటించాలని మరియు పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
వేడుక కార్యక్రమాలు  నిర్వహించే వారు మ్యూజిక్ సిస్టమ్ రాత్రి 10 గం.,ల తరువాత వాడరాదు (సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం).
రాత్రి 10 గంటల తరువాత పోలీసులు వాహానల తనిఖి చేపట్టనున్నందున ఆత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో ముఖ్యమైన జంక్షన్‌లు అదే విధంగా ముఖ్యమైన ప్రదేశాలలో పికెట్‌లు వేయడం జరుగుతుందని తెలిపారు.
మేగజైన్స్, హోర్డింగ్స్ లలో అశ్లీలత కల్గిన పోస్టర్లు గాని ప్రకటనలు గాని వేడుకలకు సంభందించి చేయరాదు.వేడుకలలో  అశ్లీల నృత్యాలు, చర్యలు, సినిమాలు, అశ్లీల సంజ్ఞలు ఆనుమతించబడవు.
అవుట్- డోర్ కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో డీజే సౌండ్ బాక్సులు, బాణాసంచాను కాల్చడానికీ అనుమతి ఇవ్వట్లేదని స్పష్టం చేశారు.
మహిళలపై ఎలాంటి వేధింపులకు పాల్పడకుండా నిరోధించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం అందుబాటులో ఉంటాయని తెలిపారు.
వైన్ షాపులు నిర్దేశిత సమయంలోగా మూసివేయాల్సి ఉంటుందని, మైనర్లకు మద్యం విక్రయించే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మోటార్ బైక్ ల సైలెన్సర్ తీసివేసి ఆదిక శబ్ధం వచ్చేలా రోడ్లపై ప్రయాణించరాదు.
మద్యం సేవించి రోడ్లపై ప్రయాణించరాదు.
వాహనాలపై ఆదిక వేగంతో మరియు ప్రమాదకరమైన డ్రైవింగ్ చేయరాదు.
డ్రంకెన్ డ్రైవ్‌ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహిస్తామని, మద్యం మత్తులో వాహనాలను నడిపే వారు, మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని , బైక్ రేసర్లపై నిఘా ఉంచుతామని అన్నారు.ఆకతాయిలు  మితిమీరి ప్రవర్తించే యువతను, రోడ్ లపై చిందులు తొక్కే మందుబాబులను, ఇష్టానుసారంగా వాహనాలను నడిపే వారిని చిత్రీకరించేందుకు వీడియో కెమేరాలు మరియు డిజిటల్ కెమేరాలు   ఉపయోగిస్తున్నాము.
శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అన్ని చర్యలను తీసుకుంటున్నామని, పోలీసులకు సహకరించాలని సూచించారు. పెట్రోలింగ్ ముమ్మరం చేస్తామని వివరించారు. ప్రత్యేక పోలీసు బృందాలను నియమిస్తామని అన్నారు.
తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని,నిబందనలు పాటించని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
పై నిభందనలు పాటిస్తూ న్యూ ఇయర్ వేడుకలు అందరూ సంతోషంతో జరుపుకోవాలని శ్రీశైలం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్