- Advertisement -
మావోయిస్టు బ్లాస్ట్ లో తొమ్మిది మంది పోలీసుల దుర్మరణం
Nine policemen were killed in a Maoist blast
బీజూపూర్
చాలా కాలం తర్వాత మావోయిస్టులు పోలీసులపై పైచేయి సాధించారు. 2009లో సుక్మా జిల్లాలోని చింతల్ నార్-తాడిమెట్ల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పేల్చిన మందు పాతర ఘటనలో 76 మంది జవాన్లు మృతి చెందారు. ఆ తర్వాత దంతెవాడ జిల్లాలో మరో ఘటనలో పదిమందికి పైగా పోలీసులు మృతి చెందారు. 15 ఏళ్ల తర్వాత ఇంత భారీ ఘటన చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి. తాజాగా చత్తీస్గడ్ లో బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డ అనంతరం మావోయిస్టులు డ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
కేంద్ర మంత్రి అమిత్ షా హామీలతో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా బిజెపి ప్రభుత్వం పావులు కదుపుతోంది. తాజాగా
కుత్రు అటవీ ప్రాంతంలో భద్రతాలబలగాలు వెళ్తున్న వాహనాన్ని ఐఈడీ పెట్టి పేల్చివేశారు. ఈ ఘటనలో 9 మంది చనిపోయారు. 8 మంది డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్ జవాన్లు, ఒక డ్రైవర్ మరణించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. పేలుడు ఘటనతో ఒక్కసారిగా పోలీసు యంత్రాంగం ఉలిక్కిపడింది.
- Advertisement -