టాలీవుడ్ హీరో నితిన్ నేడు (మార్చి 30) 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన కొత్త చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.
వకీల్ సాబ్ సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో నితిన్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘తమ్ముడు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన మేకర్స్.. నేడు నితిన్ పుట్టినరోజు కావడంతో ఒక పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సినిమాని దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతున్న 56వ సినిమాగా రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు కూడా దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్‌లో నితిన్ కాస్త డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఆడవాళ్లు లారీ తోలుతుంటే లారీపై కుమారస్వామి ఆయుధం పట్టుకొని నితిన్ కూర్చున్నాడు.భారీ యాక్షన్ ఎపిసోడ్‌కు సంబంధించిన సీన్ నుంచి ఈ పోస్టర్‌ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. నితిన్- దర్శకుడు విక్రమ్ కే కుమార్ కాంబినేషన్‌లో మరో సినిమాను రానుంది. వీరిద్దరి కాంబోలో ఇష్క్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో నితిన్ భారీ హిట్ అందుకున్నాడు.