Sunday, February 15, 2026

నిత్య చైతన్యమూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్

- Advertisement -

నిత్య చైతన్యమూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్

Nitya Chaitanyamurthy Babasaheb Ambedkar

-మంథనిలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

మంథని

నిత్య చైతన్యమూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. మంథనిలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్  ఆధ్వర్యంలో మంథని పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా నాయకులు ఆయిలి ప్రసాద్,మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమా సురేష్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు నూకల బానయ్య,వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్,మాజీ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్,ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మంథని రాకేష్,మాజీ ఎంపీపీ కొండ శంకర్,శ్రీనివాస్ మాట్లాడుతూ  కారణజన్ముడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్  భారత రాజ్యాంగ శిల్పిగా పూజలు అందుకుంటున్న మహనీయులు అని అన్నారు.నేడు ఆ మహానుభావుడు పరమపదం చెందిన పుణ్యతిది. ఈ సందర్భంగా ఆ దీనజనోద్ధారునికి భక్తిపూర్వకంగా అంజలి ఘటిస్తున్నామన్నారు..అందరూ ఆరాధించే గొప్ప సంఘ సంస్కర్త అంబేద్కర్.ఆయన ఆలోచనలు,సిద్ధాంతాలు సర్వదా అనుసరణీయం.ఆయనపట్ల భక్తి భావనే లండన్ లో ఆయన నివసించిన గృహాన్ని,లక్నోలో ఆయన స్మారక మందిరాన్ని సందర్శించేలా చేశారని దేశంలో నిరంతరాయంగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి రాజ్యాంగ రూపకర్తగా అంబేద్కర్ అద్యులుగా చెప్పుకోవడం మనకు గర్వకారణం అన్నారు. రాజ్యాంగంలో నాడు ఆయన కల్పించిన పౌరహక్కులు, ఆదేశిక సూత్రాలు నేటికీ, ఏనాటికీ ప్రజలకు రక్షణగానే నిలుస్తుంటాయన్నారు. నేటి తరం రాజకీయ నాయకుల వికృత వైపరీత్యాలను ముందే పసిగట్టి ప్రజలకు ఇటువంటి రక్షా బంధనం రూపొందించారేమోనని ప్రస్తుత పరిస్థితులలో అనిపించకమానదన్నారు. భారతదేశంలో పుట్టిన ఒక గొప్ప మేధావిగా, మానవతా విలువలు మూర్తీభవించిన మహా మనిషిగా ప్రపంచం కొనియాడిన అంటేద్కర్  చూపిన మార్గంలోనే నడుస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల, మున్సిపల్, యూత్ కాంగ్రెస్, ఎస్సీ సెల్, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్