నిజమాబాద్ జిల్లా దారుణం..విద్యార్థుల మద్య ఘర్షణ తోటి విద్యార్ధి మృతి
హైదరాబాద్ మార్చ్ 4
నిజమాబాద్ జిల్లా దారుణం చోటు చేసుకుంది. విద్యార్థుల జరిగిన ఘర్షణ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని గాంధారి మండలం తిప్పారి తండాకు చెందిన వెంకటేష్(23) బోధన్‌లోని బీసీ హాస్టల్‌లో ఉంటూ చదువుతున్నాడు. ఈ క్రమంలో వెంకటేష్ పరీక్షలు ఉన్నందున చదువుకోవాలని విద్యార్థులకు సూచించాడు.దీంతో ఇంటర్ విద్యార్థులు, వెంకటేష్ మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దిగారు. వెంకటేష్‌ను ఇంటర్ విద్యార్థులు గొంతు నులిమి హత్య ) చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేష్ మృతితో తండాలో విషాదం నెలకొంది.
నిజమాబాద్ జిల్లా దారుణం..విద్యార్థుల మద్య ఘర్షణ తోటి విద్యార్ధి మృతి

- Advertisement -
- Advertisement -