ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన బీఆర్‌ఎస్ పార్టీ
కారును పోలిన గుర్తులను ఏ పార్టీకీ కేటాయించవద్దని ఎన్నికల సంఘానికి నివేదించినా పట్టించుకోకపోవడంతో బీఆర్‌ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఏ పార్టీకీ వాటిని కేటాయించవద్దు. ఢిల్లీ హైకోర్టులో బీఆర్‌ఎస్ రిట్ పిటిషన్
నేడు న్యాయస్థానంలో విచారణ
కారును పోలిన గుర్తులను ఏ పార్టీకీ కేటాయించవద్దని ఎన్నికల సంఘానికి నివేదించినా పట్టించుకోకపోవడంతో బీఆర్‌ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ చేపట్టనున్నది. కారును పోలిన గుర్తులను తొలగించాలని, వాటిని ఏ పార్టీకి కేటాయించవద్దని కోరుతూ బీఆర్‌ఎస్ పార్టీ గతంలో పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. బీఆర్‌ఎస్ విజ్ఞప్తి మేరకు 2011లో రోడ్డురోలర్ గుర్తును తొలంగించినప్పటికీ తిరిగి చేర్చటాన్ని అభ్యంతరపెడుతూ ఆ గుర్తును తొలగించాలని విజ్ఞప్తిచేసింది.