Monday, March 24, 2025

 స్పీకర్ పై అవిశ్వాసం… బీఆర్ఎస్ నిర్ణయం

- Advertisement -

 స్పీకర్ పై అవిశ్వాసం…
బీఆర్ఎస్ నిర్ణయం
హైదరాబాద్, మార్చి 13, (వాయిస్ టుడే)

No-confidence motion against Speaker...
BRS decision

తెలంగాణలో స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా పని చేయాలని సూచిస్తోంది. లేకుంటే అవిశ్వాసం పెట్టేందుకు వెనుకాడబోమని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రకటించారు. సభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఉదయం నుంచి తెలంగాణ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం సభ ప్రారంభమైన తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడారు. మొదట కాంగ్రెస్‌ నేతలు మాట్లాడిన తర్వాత బీఆర్‌ఎస్‌కు స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఈ చర్చలో మాట్లాడిన జగదీష్‌ రెడ్డి కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేశారు. జగదీష్ రెడ్డి విమర్శలను తిప్పి కొట్టిన అధికార పక్షం అసలు విషయలపై మాట్లాడాలని సూచించారు. ఇలా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నడిచింది. ఇంతలో స్పీకర్ మరోసారి జగదీష్ రెడ్డికి మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ సభ మీది కాదని అందరిదీ అని అన్నారు. ‘‘ఈ సభ అందరిదీ.. సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మా అందరి తరఫున పెద్ద మనిషిగా, స్పీకర్‌గా మీరు కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదు’’ అని అనడంతో దుమారం రేగింది.  జగదీష్ రెడ్డి కామెంట్స్‌పై కాంగ్రెస్ మరోసారి మండిపడింది. స్పీకర్‌ను ఉద్దేశించి అలా ఎలా మాట్లాడతారని ప్రశ్నించింది. దళితులంటే గౌరవం లేదని అందుకే బీఆర్‌ఎస్‌ ప్రతిపక్షంలో కూర్చొందని ఎద్దేవా చేశారు. జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్‌బాబు సహా   కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. స్పీకర్ను దూషించేలా జగదీష్ రెడ్డి సహా బీఆర్‌ఎస్ నేతల తీరు ఉందని మండిపడ్డారు.  ఇంతలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ… కాంగ్రెస్‌ నేతల తీరును తప్పుపట్టారు. జగనదీష్ రెడ్డి ఏం తప్పుగా మాట్లాడారని నిలదీశారు. సభలో అందరికీ సమానం హక్కులు ఉన్నాయని చెప్పడం తప్పా అని ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు మరింతగా ఫైర్ అయ్యారు. మొదటి నుంచి దళితులంటే బీఆర్‌ఎస్‌కు చిన్నచూపే అన్నారు. ఉద్యమం సమయంలో దళితుడే తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి అని చెప్పిన కేసీఆర్ మోసం చేశారని అన్నారు. అప్పటి నుంచి అడుగడుగునా దళితులను తొక్కే ప్రయత్నం చేశరాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యుల కామెంట్స్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ నేతలు, వాళ్లకు వ్యతిరేకంగా అధికార పార్టీ లీడర్లు నినాదాలు చేసుకున్నారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో సభను స్పీకర్ వాయిదా వేశారు. వాయిదా తర్వాత మీడియా పాయింట్ వద్ద కూడా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే హరీష్‌రావు అవిశ్వాస తీర్మానం విషయం తెరపైకి తీసుకొచ్చారు. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా సభను నడిపించకపోతే కచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెడతామన్నారు. సభ వాయిదా పడిన తర్వాత మీడియాతో చిట్‌చాట్ చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు…స్పీకర్‌ను జగదీష్ రెడ్డి అవమానించలేదని మరోసారి స్పష్టం చేశారు. సభ మీ ఒక్కరిది కాదు అందరిదీ అన్నారని గుర్తు చేశారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదని తెలిపారు. మీ ఒక్కరిదీ అనే పదం అన్ పార్లమెంట్ పదం కానేకాదన్నారు.  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చేశారో తెలీదని ఎద్దేవా చేశారు. సభను ఎందుకు వాయిదా వేశారో కూడా అర్థం కాలేదన్నారు. కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందని అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై స్పీకర్‌ను కలిసి సభా రికార్డులు తీయాలని కోరామన్నారు. జగదీష్ రెడ్డి మాట్లాడిన సభ వీడియో రికార్డు అడిగామని తెలిపారు. ఆ వీడియోలు కూడా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద BRS ఎమ్మెల్యేలను మాట్లాడకుండా బ్లాక్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్